వందేమాతరం శ్రీనివాస్ కు 'కాళోజి' పురస్కారం

Published : Sep 06, 2017, 04:57 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
వందేమాతరం శ్రీనివాస్ కు 'కాళోజి' పురస్కారం

సారాంశం

తెలుగు టెలివిజన్ రచయితల సంఘం తరపున ప్రతియేటా కాళోజీ పురస్కారం ఈసారి సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కు కాళోజి పురస్కారం గతేడాది అవార్డు పొందిన చంద్రబోస్, ఈసారి అవార్డీ వందేమాతరం లకు సన్మానం

ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా, ప్రజా గాయకుడు, సంగీత దర్శకుడు  వందేమాతరం శ్రీనివాస్ కు కాళోజి పురస్కారం ఇవ్వనున్నట్లు తెలుగు టెలివిజన్ రచయితల సంఘం అధ్యక్షులు డి .సురేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

 

ఈ సందర్భంగా డి .సురేష్ కుమార్ మాట్లాడుతూ - ''గత 5 ఏళ్లుగా ప్రజా కవి కాళోజి నారాయణ రావు గారి జన్మదిన సందర్భంగా ఆయన పేరుమీద 'కాళోజి'  పురస్కారం  తెలుగు సినిమా పరిశ్రమ లోని ప్రముఖ రచయితలకు ఇస్తూ వచ్చాము. ఈ ఏడాది  ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అయినా వందేమాతరం శ్రీనివాస్ కు ఈ అవార్డు ఇవ్వడానికి సంతోషంగా వుంది. 2016 లో రచయిత చంద్ర బోస్ కి కాళోజి అవార్డ్స్ ని ప్రకటించడం జరిగింది.  వారం లో జరగబోయే ఈ  ప్రదానోత్సవంలో ఒకే వేదిక పై  చంద్ర బోస్, వందేమాతరం శ్రీనివాస్ లను సన్మానించడం జరుగుతుంది." తెలంగాణ టివి డెవలప్మెంట్ ఫోరమ్, భారత్ కల్చరల్ అకాడమీ మరియు తెలుగు టివి  రచయితల సంఘం ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం