రెండేండ్లుగా నా లైఫ్ లో చాలా జరుగుతున్నాయి.. దాని వల్లే నిలబడ్డాను.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..

By Asianet News  |  First Published Mar 28, 2023, 7:15 PM IST

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 


స్టార్ హీరోయిన్ సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలో తన అభిమానులు, ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. చివరిగా ‘యశోద’తో మంచి సక్సెస్ అందుకున్న సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ Shaakuntalam చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంతో కేరీర్ లో భారీ చిత్రంగా.. పాన్ ఇండియా ఫిల్మ్ గా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సమంత ఆయా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తన వ్యక్తిగత విషయాలపైనా స్పందిస్తున్నారు. 

అయితే 2021లో స్టార్ హీరోయిన్ సమంత (Samantha)  నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరి డివోర్స్ అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. ఇప్పటికీ వీరిద్దరూ ఎందుకు విడిపోయారన్నది రహస్యంగానే మిగిలి ఉంది. అయితే విడాకుల తర్వాత సమంత కాస్తా అనారోగ్యానికీ గురయ్యారు. అందుకే అప్పట్లో దేవాలయాలను సందర్శిస్తూ కనిపించారు. మరోవైపు గతేడాది అక్టోబర్ లో తను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు వెల్లడించింది. ఇక ఈ మధ్యనే కోలుకుంది. 

Latest Videos

తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘గత రెండున్నరేళ్లలో నా జీవితంలో చాలా జరుగుతున్నాయని భావిస్తున్నాను. కానీ నా పనే నిజంగా నన్ను నిలబెట్టింది. ఇప్పటికీ నిలకడగా ఉండే శక్తిని ఇచ్చింది. నేను సాధారణంగా దేని కారణంగా నా పనిని ప్రభావితం చేయనివ్వను. నేను మంచం మీద నుండి లేవలేకపోతే తప్ప. కానీ గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉంది.‘ అని చెప్పుకొచ్చింది. అలాగే తను అలాంటి పరిస్థితితో ఉన్నప్పుడు ఇటు ప్రొడక్షన్ వారు, అటు అభిమానులు తనకెంతో మద్దతిచ్చారని పేర్కొంది. అదే నన్ను కోలుకునేలా చేసి మళ్లీ షూటింగ్ వెళ్లేలా చేసిందని చెప్పింది. 

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘శాకుంతలం’. సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. పురాణాల్లోని ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంతో ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్స్ ను చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్  సినిమాపై అంచనాలను పెంచేశాయి. చిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఏప్రిల్ 14న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. 

click me!