సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్.. డిశ్చార్జ్ అయ్యేది ఎప్పుడంటే.. ప్రకటించిన వైష్ణవ్ తేజ్

pratap reddy   | Asianet News
Published : Oct 03, 2021, 10:25 AM IST
సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్.. డిశ్చార్జ్ అయ్యేది ఎప్పుడంటే.. ప్రకటించిన వైష్ణవ్ తేజ్

సారాంశం

గత నెల వినాయక చవితి రోజున సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బైక్ నుంచి పడడంతో తేజు గాయాలపాలయ్యాడు. కొన్ని వారాలుగా సాయి ధరమ్ తేజ్ కు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

గత నెల వినాయక చవితి రోజున సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బైక్ నుంచి పడడంతో తేజు గాయాలపాలయ్యాడు. కొన్ని వారాలుగా సాయి ధరమ్ తేజ్ కు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నెమ్మదిగా తేజు ఆరోగ్యం కుదుట పడుతోంది అంటూ అపోలో వైద్యులు ప్రకటిస్తూ వచ్చారు. 

రిపబ్లిక్ చిత్ర రిలీజ్ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ తనతో ఫోన్ లో మాట్లాడాడని దర్శకుడు దేవ కట్టా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ తేజు ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాడనేది మాత్రం తెలియడం లేదు. దీనిపై సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. 

వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం కొండపోలం చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంటర్వ్యూలో తేజు హెల్త్ గురించి ప్రశ్నించగా.. తేజు ఆరోగ్యం బావుంది. త్వరగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం తేజుకి ఫిజికల్ థెరపీ జరుగుతోంది. బహుశా మరో వారంలో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వైష్ణవ్ తేజ్ గుడ్ న్యూస్ ప్రకటించాడు. 

సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం చిత్రం అక్టోబర్ 8న రిలీజ్ కు రెడీ అవుతోంది. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్