వైఎస్ 'యాత్ర' కోసం మెగాస్టార్ డబ్బింగ్ పాట్లు!

Published : Jan 19, 2019, 01:24 PM IST
వైఎస్ 'యాత్ర' కోసం మెగాస్టార్ డబ్బింగ్ పాట్లు!

సారాంశం

దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా యాత్ర అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ఒక వాయిస్ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా యాత్ర అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ఒక వాయిస్ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమా కోసం మొదటి సారి మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పారు. 

వైఎస్ పాత్రలో మమ్ముట్టి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సినిమా ట్రైలర్ అండ్ తీజర్స్ అలాగే పోస్టర్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ డోస్ పెంచితే ఇంకా పెంచాలని చిత్ర యూనిట్ వాయిస్ ఆఫ్ యాత్ర అనే పేరుతో మమ్ముట్టి డబ్బింగ్ చెబుతున్న వీడియోను రిలీజ్ చేసింది. సినిమా మొదలైనప్పుడే మమ్ముట్టి తెలుగుపై పట్టు సాదించేందుకు కృషి చేసినట్లు తెలుస్తోంది. 

ఇక డబ్బింగ్ కాస్త లేట్ అయినప్పటికీ పర్ఫెక్ట్ గా తెలుగు పదాలు వచ్చేవరకు వదల్లేదట. వైఎస్ పాదయాత్రలో ఎక్కువగా గ్రామాల్లో ఉండే జనల భాషలో మాట్లాడుకుంటూ వెళ్లేవారు. అందుకే మమ్ముంటి కూడా లోకల్ ఆంధ్ర రాయలసీమ ఫ్లేవర్ మిస్సవ్వకుండా పదాలను నేర్చుకున్నట్లు తెలుస్తోంది. మరి సినిమాలో ఆయన పడిన కష్టం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

                                                 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్