భార్య సురేఖతో చిరంజీవి హాలిడే ట్రిప్... వచ్చిన వెంటనే ఆ ప్రాజెక్ట్ షురూ!

Published : Jul 07, 2023, 02:04 PM IST
భార్య సురేఖతో చిరంజీవి హాలిడే ట్రిప్... వచ్చిన వెంటనే ఆ ప్రాజెక్ట్ షురూ!

సారాంశం

చిరంజీవి-సురేఖ అమెరికా పయనమయ్యారు. కొద్దిరోజులు అక్కడ సేద తీరనున్నారు. ఏకాంతంగా గడపడున్నారు. ఈ మేరకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.   

చిరంజీవి స్పీడ్ కి యంగ్ హీరోలు సరిపోవడం లేదు. ఏడాది వ్యవధిలో చిరంజీవి మూడు సినిమాలు విడుదల చేశారు. ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్ చేశాడు. మరో నెల రోజుల్లో ఇంకో మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా శంకర్ ఆగష్టు 11న విడుదల కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. చిరంజీవి నిన్న డబ్బింగ్ పూర్తి చేశారు. 

భోళా శంకర్ చిత్రానికి పూర్తిగా ప్యాకప్ చెప్పిన చిరంజీవి భార్య సురేఖతో రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేశారు. కొద్దిరోజులు అమెరికాలో విహరించేందుకు పయనమయ్యారు. చిరంజీవి దంపతులు స్పెషల్ ఫ్లైట్ లో అమెరికా వెళుతున్నారు. తమ అమెరికన్ టూర్ గురించి చిరంజీవి సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇక ట్రిప్ ముగించుకుని వచ్చాక కూతురు సుస్మిత బ్యానర్ లో మూవీ చేయనున్నారట. ఈ విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండనుందట. 

ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సంతోష్ శోభన్ హీరోగా శ్రీదేవి శోభన్ బాబు టైటిల్ తో ఒక మూవీ చేశారు. 

ఇక చిరంజీవి-మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కిన భోళా శంకర్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళ చిత్రం వేదాళం రీమేక్ గా భోళాశంకర్ తెరకెక్కింది. భోళా శంకర్ మూవీలో తమన్నా హీరోయిన్. కీర్తి సురేష్ సిస్టర్ రోల్ చేస్తుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనిల్ సుంకర తెరకెక్కించారు. 
 

PREV
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి