రామ్ అసంతృప్తిగా ఉన్నాడా..?

Published : Oct 17, 2018, 01:22 PM ISTUpdated : Oct 17, 2018, 01:24 PM IST
రామ్ అసంతృప్తిగా ఉన్నాడా..?

సారాంశం

యంగ్ హీరో రామ్ నటించిన 'హలో గురు ప్రేమకోసమే' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో రామ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దిల్ రాజు బ్యానర్ లో సినిమాలు చేయడానికి హీరోలు ఆసక్తి చూపుతుంటారు

యంగ్ హీరో రామ్ నటించిన 'హలో గురు ప్రేమకోసమే' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో రామ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దిల్ రాజు బ్యానర్ లో సినిమాలు చేయడానికి హీరోలు ఆసక్తి చూపుతుంటారు.

రామ్ కూడా అలానే ఈ సినిమా ఒప్పుకున్నాడు. అయితే దిల్ రాజు పబ్లిసిటీ స్ట్రాటజీ విషయంలో రామ్ అసంతృప్తిగా ఉన్నాడని టాక్. పండగరోజు సినిమా థియేటర్ లోకి రావడం ఓ విధంగా ప్లస్ పాయింట్ అయినా.. బరిలో 'అరవింద సమేత' సినిమా ఉండడంతో రామ్ బాక్సాఫీస్ వద్ద మెప్పించడం అంత సులువైన విషయం కాదు.

పైగా అతడు నటించిన గత చిత్రాలు ఫ్లాప్ కావడం, దిల్ రాజు గత సినిమాల పరిస్తితి కూడా అలానే ఉండడంతో ఈ దశలో ప్రమోషన్లు భారీగా చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రమోషన్స్ విషయంలో రామ్ స్రవంతి బ్యానర్ తో కలిసి సెపరేట్ గా ప్లానింగ్ చేసుకునేవాడు.

కానీ ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ కావడంతో తన ఆలోచనలు, ప్లాన్ లు ఏవీ వర్కవుట్ కావడం లేదు. రిలీజ్ కు ముందు రావాల్సిన బజ్ ని ఈ సినిమా క్రియేట్ చేయలేకపోయింది. సినిమా విడుదలైన తరువాత హిట్ అయితే ఆ లోటు పెద్దగా ఉండదు. టాక్ బావుండి వసూళ్లు తగ్గితే మాత్రం ప్రమోషన్స్ లోపమనే చెప్పాలి!

ఇవి కూడా చదవండి..

'అరవింద సమేత'తో తన సినిమాను పోల్చుకున్న హీరో!

‘‘హలో గురు ప్రేమకోసమే‌‌‌’’లో రామ్ ఎనర్జిటిక్ లుక్ (ఫోటోలు)

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్