`వారుసుడు` 14కి వాయిదా.. చిరంజీవి, బాలయ్య కోసం పోస్ట్ పోన్.. దిల్‌రాజు స్పష్టం..

Published : Jan 09, 2023, 10:38 AM IST
`వారుసుడు` 14కి వాయిదా.. చిరంజీవి, బాలయ్య కోసం పోస్ట్ పోన్.. దిల్‌రాజు స్పష్టం..

సారాంశం

 `వారసుడు` చిత్రం వాయిదా పడింది. తమిళంలో సేమ్‌ డేట్‌కి రిలీజ్‌ కానుంది. కానీ తెలుగులో మాత్రం ఈ నెల 14న రిలీజ్‌ కానుందని నిర్మాత దిల్‌రాజు తెలిపారు.

విజయ్‌ హీరోగా నటించిన `వారసుడు` చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళంలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం వాయిదా పడింది. తమిళంలో సేమ్‌ డేట్‌కి రిలీజ్‌ కానుంది. కానీ తెలుగులో మాత్రం ఈ నెల 14న రిలీజ్‌ కానుందని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దిల్‌రాజు వెల్లడించారు. 

తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ నటించిన `వాల్తేర్ వీరయ్య`, `వీరసింహారెడ్డి` చిత్రాలు భారీ రిలీజ్‌ ఉండటంతో థియేటర్ల సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు దిల్‌రాజు. దీనిపై పెద్దలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏది జరిగినా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు బాగుండాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. సినిమాపై నమ్మకంతో తాను వెనక్కి తగ్గినట్టు చెప్పారు. ఒక చోట హిట్‌ అయిన సినిమా వేరే భాషలో గ్యాప్‌తో రిలీజ్‌ అయినా హిట్‌ అవుతున్నాయి. ఇటీవల `కాంతార`నే అందుకు ఉదాహరణ. మా సినిమా కూడా అలానే తెలుగులోనూ ఆడుతుందన్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?