RC15 : రామ్ చరణ్ - శంకర్ సినిమాలో ఆ పవర్ ఫుల్ మెసేజ్.. అదేంటంటే!?

By team telugu  |  First Published Jan 9, 2023, 9:05 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఆర్సీ15’.  శరవేగంగా చిత్ర షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన అప్డేట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 


బిగ్గెస్ట్ పొలిటికల్ డ్రామాగా మెగా పవర్ స్టార్ రామ్ (Ram Charan) నటిస్తున్న  లేటెస్ట్ ఫిల్మ్ ‘ఆర్సీ15’ తెరకెక్కబోతోంది. ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్  హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) చెర్రీ సరసన నటిస్తోంది. శ్రీకాంత్ అంజలి కీలక పాత్రలను పోషిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

RC15లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఒక పాత్రలో సీఎంగానూ.. మరో పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ గా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, న్యూజిలాండ్ లో షూటింగ్ జరుపుకోగా... ప్రస్తుతం సింహాచలంలో షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఫస్టాఫ్ పూర్తి చేసే పనిలో శంకర్ బిజీగా ఉన్నారంట. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు అప్డేట్స్ నెట్టింట ఎప్పటికప్పుడు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.

Latest Videos

శంకర్ సినిమా అంటేనే తారా స్థాయి అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా ఆయన ఎంతటి బలమైన కథలు ఎంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ‘ఆర్సీ15’ కథ ఏ కోణంలో సాగుతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుండటంతో ఓ సాలిడ్ మెసేజ్ అయితే ఇవ్వబోతున్నారని అంటున్నారు. ఓటు విలువను తెలియజేసే క్రమంలో.. మనం మన ఓటును అమ్ముకుంటే.. మన పిల్లల బంగారు భవిష్యత్ కూడా అమ్ముకున్నట్టే అనే సందేశం ఇవ్వబోతున్నారని టాక్. ఈ మెసేజ్ ను సినిమాలో హైలెట్ చేయబోతున్నారని తెలుస్తోంది. 2024లో ఎన్నికలు వస్తుండగా.. ఈ తరహా సినిమా రాబోతుండటం మరింతగా ఆసక్తిని పెంచుతోంది.

ఇప్పటికే రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటించబోతుండగా.. మరో ముఖ్య పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటిస్తారని తెలుస్తోంది. ఈయన సీఎం గా కనిపించబోతున్నారని, ఆయనతో పాటు నటి ఖుష్బూ కూడా కీలక పాత్రను పోషించారని,  వీరిద్దరూ సెకండాఫ్ లోనే కనిపిస్తారట. ఇప్పటికే నెట్టింట కొన్ని లీక్డ్ ఫొటోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు శంకర్ ‘ఇండియన్ 2’ కూడా తెరకెక్కిస్తున్నారు. ఇక రామ్ చరణ్ రీసెంట్ గా ‘ఆర్సీ16’ను దర్శకుడు బుచ్చిబాబుతో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనుంది. 

click me!