మెగాస్టార్ ఇంటిముందు ఉయ్యాలవాడ వారి ఆందోళన (వీడియో )

Published : Jun 30, 2019, 03:23 PM ISTUpdated : Jun 30, 2019, 03:36 PM IST
మెగాస్టార్ ఇంటిముందు ఉయ్యాలవాడ వారి ఆందోళన (వీడియో )

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ సైరా షూటింగ్ ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటుండగా ఉయ్యాలవాడ వంశ కుటుంబ సభ్యులు మెగాస్టార్ ఇంటిముందు ఆందోళనకు దిగారు.   

సినిమా కోసం తమ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకొని ఫ్యామిలీకి ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్పి ఇప్పుడు గేటు లోపటికి కూడా రానివ్వడం లేదని చెబుతున్నారు. సినిమా కథ కోసం సొంత ఊళ్లకు వచ్చి తమ ప్రాపర్టీలను సైతం షూటింగ్ కోసం వాడుకున్నట్లు చెప్పారు. 

మెగా మేనేజర్ ల వల్ల రామ్ చరణ్ ని కలవేలేకపోతున్నామని ఆయన సహాయం చేస్తారనే నమ్మకం తమకు ఉందని అన్నారు.అయితే ఈ ఘటనపై మెగా ఫ్యామిలీ నుంచి సమాధానం రావాల్సి ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ను కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. 

"

"

PREV
click me!

Recommended Stories

Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్
Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో