Ustaad Bhagath Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. ఫుల్ డిటేయిల్స్

By Asianet News  |  First Published Apr 5, 2023, 10:41 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం దర్శకుడు హరీశ్ శంకర్ కొన్నేండ్లుగా వేచి ఉన్నారు. ఇటు ఫ్యాన్స్ కూడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈరోజుతో నిరీక్షణకు తెరపడింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూట్ ప్రారంభమైంది.
 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - హరీశ్ శంకర్ (Harish Shankar) కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రాబోతున్న విషయం తెలిసిందే.  పదేండ్ల తర్వాత  మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఖుషీ  అవుతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది.ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. గతేడాది డిసెంబర్ 11న గ్రాండ్ గా పూజా  కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ‘వినోదయ సీతమ్’ షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై ఫోకస్ పెట్టారు. 

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో ఇప్పటిదాకా వచ్చింది ఒక్క 'గబ్బర్ సింగ్' సినిమానే అయినప్పటికీ..  ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం కారణంగా వీరి కలయికలో వస్తున్న రెండో సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా 'గబ్బర్ సింగ్'ని మించేలా, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా అద్భుతమైన చిత్రాన్ని అందించాలని దర్శకుడు హరీష్ శంకర్ పట్టుదలగా ఉన్నారు. ఈరోజు షూటింగ్ ప్రారంభం అయ్యిందని ఆయన ట్వీటర్ ద్వారా తెలిపారు. ఎట్టేకేళలకు ‘ఉస్తాద్ భగత్ సింగ్ రోజు వచ్చేసింది’ అంటూ తన సంతోషాన్ని ‘ఏన్నాళ్లో వేచిన ఉదయం’ అనే సాంగ్ తో వ్యక్తం  చేశారు. నిజానికి హరీశ్ శంకర్ 2019లో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ తర్వాత  మరే చిత్రం చేయలేదని తెలిసిందే.  

Latest Videos

పవన్ కళ్యాణ్ కోసం ఏకంగా ఐదేండ్ల పాటు వేచి ఉన్నారు. ఫైనల్ గా ఈ రోజు చిత్రం షూటింగ్ ప్రారంభిస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ తో పాటు హరీశ్ శంకర్ పట్టలేని ఆనందంలో ఉన్నారు. మొత్తానికి ఈరోజు (బుధవారం) నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి రూపొందించిన అద్భుతమైన పోలీస్ స్టేషన్ సెట్ లో మొదటి షెడ్యూల్ జరగనుంది. కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొననున్నారు. స్టార్ హీరోయిన్  పూజా  హెగ్దే (Pooja Hegde) కూడా పవన్ సరసన నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే యంగ్ బ్యూటీ  శ్రీలీలా (Sreeleela) కన్ఫమ్ అయ్యారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  

ఈ చిత్రం కోసం అత్యుత్తమ సాంకేతిక బృందం పని చేస్తోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'గబ్బర్ సింగ్' ఘన విజయంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఎంతటి కీలక పాత్ర పోషించిందో తెలిసిందే. మరోసారి ఆ స్థాయి సంగీతంతో అలరించడానికి దేవి శ్రీ ప్రసాద్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా ఆనంద్ సాయి, ఎడిటర్ గా ఛోటా కె.ప్రసాద్ పని చేస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాలో అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం కోసం అత్యుత్తమ సాంకేతిక బృందం పని చేస్తోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'గబ్బర్ సింగ్' ఘన విజయంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఎంతటి కీలక పాత్ర పోషించిందో తెలిసిందే. మరోసారి ఆ స్థాయి సంగీతంతో అలరించడానికి దేవి శ్రీ ప్రసాద్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా ఆనంద్ సాయి, ఎడిటర్ గా ఛోటా కె.ప్రసాద్ పని చేస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాలో అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలపైనే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘వినోదయ సీతమ్’ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ‘హరి హర వీరమల్లు’ సైతం పూర్తి కావచ్చినట్టు తెలుస్తోంది. ఈరోజు  ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాగా..  త్వరలోనే  సుజీత్ OG చిత్ర షూటింగ్ ను కూడా ప్రారంభించనున్నారు.  

And the Day has arrived !!!!!! pic.twitter.com/bkXFUjyM2r

— Harish Shankar .S (@harish2you)
click me!