
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన బర్త్ డే సందర్భంగా వరుసగా అభిమానులను వరుసగా సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఈ రోజు మార్నింగ్ `హరిహర వీరమల్లు` అప్ డేట్ ఇచ్చారు. ఆగిపోయిందనుకున్న సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అభిమానుల్లో ఊపిరి పోశారు. ఆ సినిమా రాబోతుందనే సిగ్నల్స్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత `ఓజీ`తో గూస్‌బంమ్స్ ట్రీట్ ఇచ్చాడు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న `ఓజీ` గ్లింప్స్ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్‌ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా `ఓజీ`లో చూపించడంతో వారంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. పండగ వాతావరణంలో మునిగి తేలుతున్నారు.
ఈ క్రమంలో ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ వచ్చింది. పవన్ నటిస్తున్న మరో మూవీ `ఉస్తాద్ భగత్ సింగ్` నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ వచ్చాయి. పవర్ ఫుల్ గ్లింప్స్ అదరగొట్టింది. సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూపించింది. ఇప్పుడు బర్త్ డే సందర్భంగా మరో కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది యూనిట్. ఇది మాస్ స్వాగ్ అనిపించేలా ఉంది. ఇందులో పవన్ నిలువునా కత్తిపట్టుకుని నడి సెంటర్‌లో కూర్చున్నారు. కత్తికి రక్తం కారుతుంది, పవన్ స్టయిల్‌గా గ్లాసెస్ పెట్టుకుని, ఎర్రని బొట్టు పెట్టుకుని స్టయిల్‌గా చూస్తున్నారు.
అయితే ఆయన లుంగి కట్టుకుని ఉండటం విశేషం.మరోవైపు వెనకాల చాలా మంది ముస్లీంలు పవన్‌ని చూసి బయడపడుతున్నట్టుగా ఈ కొత్త పోస్టర్ ఉంది. పవన్ ఫ్యాన్స్ కి మరో పర్‌ఫెక్ట్ ట్రీట్‌లా ఉందని చెప్పాలి. ఈ సందర్భంగా కొత్త లుక్‌ని పంచుకుంటూ `ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే` అనే క్యాప్షన్ పంచుకున్నారు. ధర్మ కోసం పవన్ కత్తిపట్టాడనే అర్థంలో ఈ కొత్త లుక్‌ని పంచుకోవడం విశేషం. మాస్ ఆడియెన్స్ కి మైండ్ బ్లాక్ చేసేలా ఈ పోస్టర్ ఉంది. ఇది ఆకట్టుకోవడంతోపాటు వైరల్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ ఈ `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా కొంత పార్ట్ చిత్రీకరణ జరిగింది. పవన్ `బ్రో` సినిమాతో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్‌కి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు `ఓజీ` షూటింగ్‌లో పాల్గొంటున్నారు పవన్. ఈ నెల 5 నుంచి `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రీకరణలో పాల్గొనబోతున్నారట. శరవేగంగా ఈసినిమాని షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.