'బ్రో' ...పాప ఇంటిలిజెంట్... 'ఖుషీ' తో కన్ఫర్మ్ చేసింది

Published : Jun 05, 2023, 02:27 PM IST
 'బ్రో' ...పాప ఇంటిలిజెంట్... 'ఖుషీ' తో  కన్ఫర్మ్ చేసింది

సారాంశం

బ్రో చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఊశ్వరి రౌతేలా స్పెషల్ సాంగ్ చేస్తుందని సమాచారం.ఈ విషయాన్ని ఆమె తెలివిగా ఓ ట్వీట్ ద్వారా ఖరారు చేసింది.


సినిమాలో స్పెషల్ సాంగ్ ఉందంటే ఆ కిక్కే వేరు. ముఖ్యంగా పవన్ వంటి పెద్ద హీరోల సినిమాల్లో సరైన సాంగ్ పడితే థియేటర్స్ ఊగిపోతాయి. ఈ విషయం దర్శక,నిర్మాతలకు తెలుసు. అందుకే అలాంటి పాట కోసం వెతుకుతూంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ బ్రో చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ చేయనుందని సమాచారం. ఇప్పుడీ న్యూస్  మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ విషయం పై ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  అయితే ఊర్వశి రౌతేలా కాస్తంత తెలివిగా ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. అదెలా అంటే....ఇదిగో ఇలా

తాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ ఖుషీ చిత్రం చూస్తున్నానని చెప్పింది. ప్రత్యేకంగా ఈ ట్వీట్ ఎందుకు వేసిందో అందరికీ అర్దమైంది.  వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ పాటలో ఊర్వశీ రౌతేలా.. మెగాస్టార్ చిరంజీవి పక్కన స్పెషల్ సాంగ్ చేసింది. ఈ బాస్ పార్టీ పాట పెద్ద హిట్ అయింది. అలాగే అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్‍లో అదరగొట్టింది ఊర్వశి. ఇప్పుడు బ్రో సినిమాతో టాలీవుడ్‍లో ఈ ఏడాది మూడో స్పెషల్ సాంగ్ ను ఊర్వతీ రౌతేలా చేయనుందని సమాచారం.రామ్ - బోయపాటి చిత్రంలోనూ ఊర్వశీ స్పెషల్ సాంగ్ చేయబోతుంది  బ్రో సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం శ్రుతి హాసన్ మరియు దిశా పటానీ పేర్లు ఇటీవల అయితే వినిపించాయి. అయితే, ఊర్వశీ రౌతేలాకే చిత్రయూనిట్ మొగ్గుచూపింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో మూవీ డబ్బింగ్ వర్క్స్ ఇటీవలే షురు అయ్యాయి.  మెగా మేనల్లుడు సూప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా జూలై 28, 2023న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. తమిళ చిత్రం వినోదయ సీతమ్ యొక్క అఫీషియల్ రీమేక్ అయిన ఈ చిత్రానికి నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు.  అలాగే ఇటీవల విడుదలైన పవన్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?
Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?