నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. మొక్కకు నీరు పోసిన అల్లు అర్జున్.. బన్నీ పోస్ట్ వైరల్

By Asianet News  |  First Published Jun 5, 2023, 2:25 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  తాజాగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కకు నీరు పోశారు. ఆ ఫొటోను షేర్ చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. 
 


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటుడిగా ఎంత ఎదుగుతున్నాడో వ్యక్తిత్వం పరంగానూ బన్నీ అందనంత ఎత్తుకు ఎదుగుతున్నారు. ప్రతి విషయంలో తనదైన శైలిని కనబరుస్తూ ఆకట్టుకుంటున్నారు. తెలుగు పండుగలు, సంస్కృతిని ఎంతలా గౌరవిస్తారో తెలిసిందే.  అంతేకాదు తన పిల్లలకు కూడా నేర్పిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం బన్నీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 

ఇక ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ( world environment day) సందర్భంగా తమ ఇంట్లో ఓ మొక్కను నాటి నీరు పోశారు. ఇదే విషయాన్ని ట్వీటర్ వేదికన పంచుకున్నారు. ‘హ్యాపీ ఎన్విరాన్ మెంట్ డే.. మనమందరం మన వంతుగా పర్యావరణాన్ని కాపాడుకుందాం‘ అని పేర్కొన్నారు. ప్రస్తుతం బన్నీ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నేచర్ పట్ల బన్నీ చూపిస్తున్న శ్రద్ధకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ స్ఫూర్తిగా నిలుస్తున్నారంటూ ప్రశంసిస్తున్నారు. 

Latest Videos

మరోవైపు దేశంలోనూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోట్లల్లో మొక్కలు నాటి రక్షిస్తున్నారు. తెలంగాణలోనూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం పల్లె ప్రగతి పేరిట మొక్కలు నాటించిన విషయం తెలిసిందే. ఇలాంటి కార్యక్రమాల్లో మన టాలీవుడ్ స్టార్స్  కూడా భాగస్వామ్యం అయిన విషయం తెలిసిందే. తాజాగా బన్నీ ఇలా స్పందించారు. ఇక బన్నీ కూల్ లుక్ లో అట్రాక్ట్ చేశారు. 

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ ప్రస్తుతం Pushpa 2 The Rule లో నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా మారేడుమిల్లిలో షూటింగ్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ సంగీతం అందిస్తున్నారు. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్, తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

click me!