ఫోటో స్టోరీ: తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి ఫోటో దిగిన ఉపాసన

Published : Mar 21, 2018, 08:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
ఫోటో స్టోరీ: తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి ఫోటో దిగిన ఉపాసన

సారాంశం

మెగా పవర్ స్టార్ వైఫ్ గా ఉపాసనను మెగా ఫ్యాన్స్ తెగ అభిమానిస్తూ ఉంటారు. రాంచరణ్ గురించి ఎన్నో సంగతులను ఈమె బైట పెట్టేస్తూ ఉంటుంది వాటిని ఫోటోల రూపంలో కూడా చూపిస్తూ ఉంటుంది

మెగా పవర్ స్టార్ వైఫ్ గా ఉపాసనను మెగా ఫ్యాన్స్ తెగ అభిమానిస్తూ ఉంటారు. రాంచరణ్ గురించి ఎన్నో సంగతులను ఈమె బైట పెట్టేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో చెర్రీ అంత యాక్టివ్ గా ఉండడు. కానీ ఉపాసన మాత్రం.. ఫ్యామిలీ గేదరింగ్స్ నుంచి.. ఎన్నో సంగతులను చెప్పేస్తూ ఉంటుంది.. వాటిని ఫోటోల రూపంలో కూడా చూపిస్తూ ఉంటుంది.

చెర్రీ అండ్ ఫ్యామిలీకి మహేష్ బాబు కుటుంబంతో చాలానే సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే సంగతి గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. సూపర్ స్టార్ వెకేషన్స్ లో కూడా రాంచరణ్ సడెన్ ఎంట్రీ ఇచ్చేస్తుంటాడు. ఇప్పుడు మహేష్ బాబు బుజ్జాయి సితారతో కలిసి దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన. ఓ ప్లే గ్రౌండ్ లో చిన్ని ఇంటి సెట్ మాదిరిగా ఉన్న లొకేషన్ లో.. ఎంచక్కా పక్కపక్కనే కూర్చుని ఫోటోకు పోజ్ ఇచ్చారు సితార అండ్ ఉపాసన. ఇద్దరి కళ్లలో మెరుపులను చూస్తుంటే.. వీళ్లిద్దరూ ఎంత క్లోజ్ అనే సంగతి ఇట్టే పసిగట్టేయచ్చు.

తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటో ఇది అని చెప్పింది ఉపాసన. ఒక స్టార్ హీరో కూతురుతో.. మరో స్టార్ హీరో భార్య ఇంత క్లోజ్ గా మూవ్ కావడం.. ఆ విశేషాలను సోషల్ మీడియాలో జనాలకు చూపించడం భలే ఆకట్టుకుంటోంది. మెగా ఫ్యామిలీ విశేషాలను మాత్రమే కాకుండా.. ఇటు మహేష్ కుటుంబం నుంచి కూడా అప్ డేట్స్ ఇస్తుండడంతో.. ఇప్పుడు ఉపాసనకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి కూడా తెగ ఫాలోయింగ్ పెరిగిపోతోంది.

PREV
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?