ఉప్పెన కథ ఎన్టీఆర్ కి చెపితే ఎక్కడ కొట్టేశావ్ రా అన్నాడు

Published : Feb 10, 2021, 09:47 AM ISTUpdated : Feb 10, 2021, 09:50 AM IST
ఉప్పెన కథ ఎన్టీఆర్ కి చెపితే ఎక్కడ కొట్టేశావ్ రా అన్నాడు

సారాంశం

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ నాన్నకు ప్రేమతో మూవీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే . ఈ సినిమాకు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.  ఓ సాంగ్ షూటింగ్ కోసం విదేశాలలో ఉన్న ఎన్టీఆర్ కి బుచ్చిబాబు ఉప్పెన కథ వినిపించాడట. ఇది మీకు కాదు సర్, ఓ కొత్త హీరోకి బాగుంటుందని అన్నాడట. కథ మొత్తం విన్న ఎన్టీఆర్ చాలా బాగుంది, ఎక్కడ కొట్టేశావ్ రా అన్నాడట. 

ఈ మధ్య కాలంలో యూత్ లో మంచి బజ్ క్రియేట్ చేసిన చిత్రాలలో ఉప్పెన ఒకటి. ఉప్పెన సాంగ్స్ ఇప్పటికే యూత్ ని ఊపేస్తుండగా, టీజర్ మరియు ట్రైలర్ సినిమా విజయంపై మరింత నమ్మకం పెంచాయి. కొత్త నటులైనప్పటికీ వైష్ణవ్ మరియు కృతి శెట్టి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఫిబ్రవరి 12న ప్రేమికులరోజు కానుకగా ఉప్పెన విడుదల కానుంది. విడుదల సమయం దగ్గర పడుతుండగా మూవీ ప్రొమోషన్స్ జోరు పెంచారు చిత్ర యూనిట్. 

దీనిలో భాగంగా హీరో హీరోయిన్ తో పాటు దర్శకుడు బుచ్చిబాబు సానా అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఉప్పెన సినిమా అనుభవాలతో పాటు, ఆయన కెరీర్ కి సంబంధించిన పలు విషయాలు ఆయన చెప్పడం జరిగింది. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తో తనకు గల అనుబంధాన్ని ఆయన తెలియజేశారు. ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ నాన్నకు ప్రేమతో మూవీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. 

ఓ సాంగ్ షూటింగ్ కోసం విదేశాలలో ఉన్న ఎన్టీఆర్ కి బుచ్చిబాబు ఉప్పెన కథ వినిపించాడట. ఇది మీకు కాదు సర్, ఓ కొత్త హీరోకి బాగుంటుందని అన్నాడట. కథ మొత్తం విన్న ఎన్టీఆర్ చాలా బాగుంది, ఎక్కడ కొట్టేశావ్ రా అన్నాడట. ఎన్టీఆర్ అలా అన్నప్పటికీ తాను రాసుకున్న కథలో విషయం ఉందని అర్థం చేసుకున్న సంతోష పడ్డారట. ఇక ఎన్టీఆర్ సెట్స్ లో అందరితో కలిసిపోతారని, చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ అయినప్పటికీ నాతో చాలా స్నేహంగా ఉండేవారని అన్నారు. పెద్ద స్టార్ అయిన ఎన్టీఆర్ తారతమ్యాలు లేకుండా సరదాగా అందరితో గడుపుతారు అన్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది