రైతు తన కొడుకుని రైతునెందుకు చేయడు.. ఆలోచింప చేస్తున్న `శ్రీకారం` టీజర్‌

Published : Feb 09, 2021, 06:32 PM ISTUpdated : Feb 09, 2021, 06:33 PM IST
రైతు తన కొడుకుని రైతునెందుకు చేయడు.. ఆలోచింప చేస్తున్న `శ్రీకారం` టీజర్‌

సారాంశం

శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న `శ్రీకారం` చిత్ర టీజర్‌ విడుదలైంది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ ఈ టీజర్‌ని విడుదల చేశారు. రైతులు, వ్యవసాయం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తాజా టీజర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. టీజర్‌ ఆలోచింప చేస్తుంది.

`ఒక హీరో తన కొడుకుని హీరోని చేస్తాడు. ఓ డాక్టర్ తన కొడుకుని డాక్టర్‌ని చేస్తాడు. ఒక ఇంజనీర్‌ తన కొడుకుని ఇంజనీర్‌ చేస్తాడు. కానీ రైతు మాత్రం తన కొడుకుని రైతుని చేయడానికి ఇష్టపడడు. ఈ ఒక్కటి నాకు జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది... తినేవాడు మన నెత్తిమీద జుట్టంత ఉంటే.. పడ్డించేవాడు మన మూతి మీద మీసం అంత కూడా లేడు` అని అంటున్నారు హీరో శర్వానంద్‌. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం `శ్రీకారం`. ఈ చిత్ర టీజర్‌ని మహేష్‌బాబు మంగళవారం సాయంత్రం విడుదల చేశారు.

రైతులు, వ్యవసాయం నేపథ్యంలో సాగే ఈ టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఆలోచింప చేస్తుంది. రైతు తన కొడుకుని రైతుగా మార్చేందుకు ఎందుకు ఇష్టపడే ప్రశ్న ఆడియెన్స్ ని ఆలోచింప చేస్తుంది. వరిపొలాలు, పంటలు, రైతుల కష్టాలు చూపించారు. రైతు కష్టాలను, వ్యవసాయం గొప్పతనాన్ని చెప్పే విధంగా ఈ సినిమా రూపొందుతుందని టీజర్‌ని బట్టి అర్థమవుతుంది. ఈ టీజర్‌ని సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియజేశారు. కిషోర్‌.బి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్‌ సరసన ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా