#Upendra: ఆసుపత్రిలో ఉపేంద్ర.. షాక్ లో కన్నడ పరిశ్రమ..!

Published : Nov 25, 2022, 09:38 AM IST
 #Upendra: ఆసుపత్రిలో ఉపేంద్ర.. షాక్ లో కన్నడ పరిశ్రమ..!

సారాంశం

ఉపేంద్ర షూటింగ్‌లో ఉన్నట్టుండి కుప్ప కూలిపోయారు. దీంతో ఆయనకు ఏం జరిగిందోననికన్నడ ఇండస్ట్రీతో పాటు ఆయన అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు.


సీనియర్ బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే హాస్పిటల్లో చేరారనే వార్త మర్చిపోకముందే విశ్వనటుడు కమల్ హాసన్ కూడా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసి సినీ పరిశ్రమ షాక్ అయ్యింది. ఇప్పుడు ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయిటకువచ్చింది.

కన్నడ  ప్రముఖ నటుడు, దర్శకుడు, రాజకీయ నాయకుడు ఉపేంద్ర   ఆసుపత్రిలో చేరారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఉపేంద్రను మూవీ టీం హాస్పిటల్లో చేర్చారు. ఉపేంద్ర షూటింగ్‌లో ఉన్నట్టుండి కుప్ప కూలిపోయారు. దీంతో ఆయనకు ఏం జరిగిందోననికన్నడ ఇండస్ట్రీతో పాటు ఆయన అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

మిర్రర్ నౌ పత్రికలో వచ్చిన సమాచారం మేరకు ..ఆయన బెంగుళూరు కు వెళ్ళే దారిలో  నెలమంగళ హాస్పటిల్ లో చేరారు. డస్ట్ ఎలర్జీ వల్లే శ్వాసకోస సమస్యలు వచ్చాయని తెలుస్తోంది. తన నెక్ట్స్ చిత్రం కోసం యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్న ఆయనకు ఈ సమస్య రావటంతో షూటింగ్ మధ్యలో ఆపేసి హాస్పటిల్ కు తీసుకెళ్లారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం స్టేబుల్ గానే ఉంది. గురువారం మధ్యాహ్నం ఆయన్ను డిశ్చార్జ్ చేసి రెస్ట్ తీసుకోమన్నారు. ఆయన త్వరలోనే తన చిత్రం UI సెట్స్ కు రానున్నారు. 
  
ఉపేంద్ర  తెలుగువారికి కూడా సుపరిచితుడు .  ‘కన్యాదానం’, ‘ఒకేమాట’, ‘రా’, ‘టాస్’ లాంటి పలు చిత్రాలు చేశారు. కొంత గ్యాప్ తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘గని’ సినిమాల్లో కీలకపాత్రల్లో నటించి మెప్పించారు. యాక్టర్, రైటర్, డైరెక్టర్, సింగర్‌గానూ సత్తా చాటిన ఉపేంద్ర ప్రస్తుతం ‘కబ్జా’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. అలాగే ఆయన ‘ఏ’, ‘ఉపేంద్ర’, ‘ఓం’, ‘రక్తకన్నీరు’, ‘సూపర్’ లాంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించి ట్రెండ్ సెట్ చేశారు.  

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు