గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలయ్య హంగామా.. అఖండతో పాటు మరికొన్ని తెలుగు సినిమాలకు చోటు.

By Mahesh JujjuriFirst Published Nov 24, 2022, 9:35 PM IST
Highlights

గోవాలో 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ..(ఇఫీ) చలన చిత్రోత్సవం ఉత్సవాలలో సందడి చేశారు నట సింహం బాలయ్య. దర్శకుడు బోయపాటితో కలిసి పాల్గొన్న ఆయన అఖండ స్క్రీనింగ్ లో పాల్గొన్నారు. ఖాదీరాంబోస్ సినిమా టీమ్ ను అభినందించారు.  
 


గోవాలో 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ..(ఇఫీ) చలన చిత్రోత్సవం ఉత్సవాలలో సందడి చేశారు నట సింహం బాలయ్య. దర్శకుడు బోయపాటితో కలిసి పాల్గొన్న ఆయన అఖండ స్క్రీనింగ్ లో పాల్గొన్నారు. ఖాదీరాంబోస్ సినిమా టీమ్ ను అభినందించారు.  

గోవాలో 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ..(ఇఫీ) చలన చిత్రోత్సవం ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ  ఉత్సవాల సందర్భంగా తెలుగు సినిమాకు అరుదైన గౌరవం లభిస్తుంది.  ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్న ఈ వేడుకలలో... బాలయ్య సందడి చేశారు. ఈ వేడుకల్లో కొన్ని తెలుగు సినిమాలకు కూడా అవకాశం లభించింది. ఇందులో భాగంగా టాలీవుడ్ మాస్ మూవీ అఖండ కు ఈ వేడుకల్లో అవకాశం లభించింది. ఈ సందర్భంగా ఆ సినిమా హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటికి ఆహ్వానాలు అందడంతో వారిద్దరు పాల్గోన్నారు. 

టాలీవుడ్ నుంచి మరికొన్ని సినిమాలకు  అరుదైన అవకాశం  లభించింది. తెలుగు నుంచి సాధించిన ఖాదీరాం బోస్  సినిమా టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు నటసింహం బాలకృష్ణ.. డైరెక్టర్ బోయపాటి.  తెలుగు బయోపిక్ మూవీ ఖుదీరాం బోస్ కూడా ఈ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఇండియన్ పనోరమా విభాగంలో ఈ సినిమా ఎంపికైంది. ఈ సందర్భంగా ఇఫీ  ఉత్సవాల ప్రదర్శనకు హాజరైన టాలీవుడ్ సీనియరన్ స్టార్ హీరో.. నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.... ఖుదీరాం బోస్ మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన యువ నటుడు రాకేష్ జాగర్లమూడిని అభినందించారు. 

 ఇఫీ చలనచిత్రోత్సవానికి  ఈ తెలుగు సినిమాలు చాలా ఎంపికైయ్యాయి. మెయిన్ స్ట్రీమ్ సినిమా విభాగంలో అఖండతో పాటు  రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాజమౌళి  తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్' కూడా ఎంపికైంది. దీనితో పాటు అలనాటి అద్భుత తెలుగు కళా ఖండం శంకరాభరణం సినిమా కూడా ఈ సందర్భంగా ఈ వేడుకల్లో ప్రదర్శంచారు. 

అంతే కాదు ప్రముఖ నిర్మాత  స్రవంతి  రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా  కిడ కు కూడా...  గోవాలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో అవకాశం లభించింది. ఇండియన్ పనోరమాలో ఈ సినిమాను కూడా ప్రదర్శించారు. థియేటర్లో ఈ చిత్రానికి స్టాండింగ్ ఒవేషన్ లభించింది.

click me!