‘సైరా.. నరసింహారెడ్డి’ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్

Published : Jun 15, 2019, 09:35 AM IST
‘సైరా.. నరసింహారెడ్డి’ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. తొ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న ’సైరా’పై మంచి అంచనాలే ఉన్నాయి.  చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ  చిత్రం  షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. 

ఈ షెడ్యూల్ పూర్తికాగానే  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై దృష్టిపెడతారు. అక్టోబర్‌లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.  ఈ నేపధ్యంలో ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘సైరా’ ట్రైలర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం పాండిచ్చేరిలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్‌లో భాగంగా లైవ్ లొకేషన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. కథలో అత్యంత కీలకమైన పార్ట్‌ను ఇక్కడ  షూట్ చేస్తున్నారు. బ్రిటీష్ అధికారులకు, నరసింహారెడ్డికీ మధ్య జరిగే అతి కీలకమైన ఒప్పందాల నేపథ్యంలో తెరకెక్కే సన్నివేశాలు ఇవి. 

వీటి కోసం ఆ కాలం నాటి బ్రిటీష్ బిల్డింగ్‌ల సెట్ వేయాల్సి ఉందట. కానీ అందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో పాండిచ్చేరిలో ఇంకా మిగిలి ఉన్న ఆ కాలం నాటి కొన్ని పురాతన భవనాల్లో ‘సైరా’ టీమ్ షూటింగ్  జరుపుతోందనీ సమాచారం.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?