పవన్ కు తానా ఆహ్వానం, మీడియా ముందరకాళ్లకు బంధం

By AN TeluguFirst Published Jun 15, 2019, 9:30 AM IST
Highlights

తాజాగా పవన్ కళ్యాణ్ కు తానా నుంచి ఇన్విటేషన్ వచ్చింది. 

తాజాగా పవన్ కళ్యాణ్ కు తానా నుంచి ఇన్విటేషన్ వచ్చింది. జులై 4 నుంచి 6 వరకు వాషింగ్టన్ డీసీలో జరిగే తానా సభలకు పవన్ కళ్యాణ్ హాజరు కావాలంటూ జనసేనానికి ఆహ్వానాన్ని పంపారు.అయితే ఇదే విషయంపై అక్కడికి వెళ్లాలా....? వద్దా.....? అనే డైలమోలో ఆయన ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

తానాలో చీఫ్ గెస్ట్ గా హాజరయ్యే విషయంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు చెప్తున్నారు. ఒక సామాజిక వర్గానికి చెందిన తానాకు హజరుకావటం నెగిటివ్ అవుతుందన్న మాటను మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. 

అంతేకాకుండా ఇక్కడికి వెళ్తే కనుక టీడీపీతో అంతర్గతంగా చేసుకున్న ఒప్పందంలో భాగంగానే ఎన్నికల బరిలోకి పవన్ ఒంటరిగా దిగారనే ప్రచారం నిజం చేసినట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు.  ఈ ప్రచారం ఇప్పటికే పవన్ కు తీవ్ర నష్టాన్ని కలిగించింది. 

అలాకాకుండా వెళ్లకుండా ఉండిపోతే...అక్కడ ఎన్ ఆర్ ఐలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే విషయంలో పవన్ ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని ఆగిపోయారంటారు. ఇలా పవన్  వెళ్లాలా వద్దా అనే విషయంలో మీడియానే మడతపెడ్తూ కథనాలు రాసేస్తోంది.  

అయితే అదే సమయంలో కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల్ని కలుపుకుపోయే విషయంలో పవన్ మిగిలిన వారికి భిన్నంగా ఉంటారన్న పాజిటివ్ యాంగిల్ ఇలా   తానా సభలకు హాజరైతే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. చూడాలి...పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

 

click me!