NTR : `వార్‌2`లో ఎన్టీఆర్‌ పాత్ర ఇదే? హృతిక్ - తారక్ మధ్య భారీ యాక్షన్స్.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్

By Asianet News  |  First Published May 18, 2023, 9:24 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) War2తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తారక్ చేయబోతున్న రోల్ పై లేటెస్ట్ గా ఓ న్యూస్ వైరల్ గా మారింది. 
 


బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) - యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) మల్టీస్టారర్ గా బిగ్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ‘వార్’ చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే అనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్ ను ఆయాన్ ముుఖర్జీ తెరకెక్కించనున్నారు. యష్ రాజ్ స్పై యూనివర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. 

ఇదిలా ఉంటే ఈ చిత్రం గురించి మరో క్రేజీ అప్డేట్ అందింది. సినిమాలో తారక్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. తారక్ కేరీర్ లోనే ఇది తొలిసారి అని చెప్పొచ్చు. గతంలో వచ్చిన ‘జై లవ కుశ’లో ఓ పాత్ర నెగెటివ్ షేడ్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అంతకు మించిన పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. హృతిక్ రోషన్ -  ఎన్టీఆర్ మధ్య హోరాహోరా పోరు, ఊహించని స్థాయి యుద్ధ సన్నివేశాలు ఉండనున్నట్టు తెలుస్తోంది. గతంలో టైగర్ ష్రాఫ్, హృతిక్ అద్భుతమైన యాక్షన్స్ తో ఆడియెన్స్ ను ఫిదా చేశారు. 

Latest Videos

ఇక ఎన్టీఆర్ సైతం ‘ఆర్ఆర్ఆర్’లో యాక్షన్ సీక్వెన్స్ లలో అదరగొట్టిన విషయం తెలిసిందే. వార్2లోనూ భారీ యాక్షన్స్ లో నటించబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన నిడివి మాత్రం చాలా తక్కువ ఉంటుందని అంటున్నారు. నవంబర్ లో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కొనసాగుతోంది. 

మరోవైపు ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలోని NTR30 శరవేగంగా కొనసాగుతోంది. రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ కు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ప్రేక్షకుల ముందుకు ఎన్టీఆర్ రాబోతుండటం పట్ల సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. రేపు చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనుంది. 

click me!