యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) తాజాగా తను చేసిన కామెంట్లపై క్లారిటీ ఇచ్చారు. రష్మిక మందన్న ఫ్యాన్స్ మండిపడుతుంటడంతో వివరణ ఇచ్చింది.
కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. ఇండస్ట్రీలో మెట్టుమెట్టు ఎక్కుతూ వచ్చిన హీరోయిన్లలో ఈ బ్యూటీ కూడా ఒకరని చెప్పొచ్చు. చిత్ర పరిశ్రమలో తనదైన శైలిని చూపిస్తూ క్రేజ్ పెంచుకుంటోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ గా ‘ఫర్హానా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రష్మిక మందన్న నటించిన ‘శ్రీవల్లి’ పాత్రపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి పాత్ర తనకు ఇచ్చి ఉంటే రష్మిక కంటే ఇంకా బాగా చేసేదాన్ని అని వ్యాఖ్యానించింది. దీంతో చిక్కుల్లో పడింది. ఐశ్వర్య కామెంట్స్ విమర్శలకు దారి తీశాయి. రష్మిక ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో తాజాగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ మేరకు ఓ సుదీర్థమైన నోట్ ను విడుదల చేసింది.
డియర్ ఫ్రెండ్స్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలుగులో ఎలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నారు? అంటూ ప్రశ్న ఎదురైంది. దాంతో నాకు టాలీవుడ్ అంటే చాలా ఇష్టం. నచ్చిన పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను. పుష్పలో శ్రీవల్లి వంటి పాత్రలు నాకు బాగా సూటవుతాయని చెప్పుకొచ్చాను. కానీ నా కామెంట్స్ తప్పుగా వెళ్లాయి. రష్మిక పనితనాన్ని నేను తప్పుబట్టినట్టు వార్తలు కూడా వస్తున్నాయి.
వాస్తావానికి నేను రష్మిక యాక్టింగ్ కు ఫిదా అయ్యాను. నా తోటీ యాక్టర్స్ పై నాకు చాలా గౌరవం ఉంటుంది. అయితే కొందరు పుకార్లను వ్యాప్తి చేస్తున్నారు. ఇకనైనా దయచేసి రూమర్లను ఆపేయండి’ అంటూ వివణ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే ఐశ్వర్య రాజేశ్ తెలుగు, తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. తెలుగులో ఇప్పటికే ‘డియర్ కామ్రేడ్’, ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’ వంటి చిత్రాల్లో నటించింది.
From the desk of Aishwarya Rajesh pic.twitter.com/kP6ZEufbTS
— Ramesh Bala (@rameshlaus)