Radhe Shyam:నీ రాతలే సాంగ్ ప్రోమో... ప్రేమ జడిలో తడిసి ముద్ద అవుతున్న ప్రభాస్-పూజా

Published : Feb 24, 2022, 03:33 PM IST
Radhe Shyam:నీ రాతలే సాంగ్ ప్రోమో... ప్రేమ జడిలో తడిసి ముద్ద అవుతున్న ప్రభాస్-పూజా

సారాంశం

రాధే శ్యామ్ (Radhe Shyam)విడుదలకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ నిద్రపోతున్నారు. సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ పచ్చిబూతులు తిడుతున్నారు. ఎట్టకేలకు రాధే శ్యామ్ మేకర్స్ లో చలనం కలిగింది. మూవీ నుండి సాంగ్ విడుదల చేస్తున్నారు. 

ప్రభాస్ (Prabhas)హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ లో రాధే శ్యామ్ తెరకెక్కుతుంది. యూవీ క్రియేషన్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కి కొంచెం కూడా మంచి అభిప్రాయం లేదు. సకాలంలో సినిమా పూర్తి చేయరు, అప్డేట్స్ ఇవ్వరని యూవీ క్రియేషన్స్ ని సోషల్ మీడియాలో రాయలేని భాషలో ఫ్యాన్స్ తిడుతూ ఉంటారు. వాళ్ళు తిడతారు మేము పడతాం అన్నతీరుగా యూవీ క్రియేషన్స్ వ్యవహరిస్తోంది. చాలా కాలంగా ప్రభాస్ ఫ్యాన్స్ నుండి ఇది అతిపెద్ద కంప్లైంట్ గా ఉంది. అయినా యూవీ క్రియేషన్స్ తీరు మారడం లేదు. 

రాధే శ్యామ్ విడుదల దగ్గిర పడుతున్న నేపథ్యంలో సినిమా అప్డేట్స్ ఇవ్వాలి, ప్రమోషన్స్ నిర్వహించాలని ఫ్యాన్స్ నుండి డిమాండ్ అధికమైంది. ఈ విషయంలో ఫ్యాన్స్ అసహనం ఫీక్స్ కి చేరింది. గత వారం రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండగా యూవీ క్రియేషన్స్ ఓ సాంగ్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాధే శ్యామ్ మూవీలోని ఈ రాతలే సాంగ్ రేపు మధ్యాహ్నం 12:00 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో నేడు ఈ రాతలే సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఈ రాతలే సాంగ్ లిరికల్ సాంగ్ ఇప్పటికే విడుదల కాగా.. రేపు వీడియో సాంగ్ విడుదల చేయనున్నారు. 

ఈ రాతలే సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ కంపోజ్ చేశారు. యువన్ శంకర్ రాజా, హరిణి పాడారు. కృష్ణ కాంత్ సాహిత్యం అందించారు ఇక రాధే శ్యామ్ మూవీ మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా రికార్డు థియేటర్స్ లో విడుదల కానుంది. మొత్తంగా ఐదు భాషల్లో రాధే శ్యామ్ విడుదలవుతుంది. 

దర్శకుడు రాధా కృష్ణ పీరియాడిక్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. విధికి ప్రేమకు మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాగా రాధే శ్యామ్ తెరకెక్కుతుంది. ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే (Pooja hegde)నటిస్తున్నారు. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో రాధే శ్యామ్ తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఎంతనో ఎదురుచూస్తున్నారు. రాదే శ్యామ్ మూవీ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఓ కీలక రోల్ చేస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం