
మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) వరుస సినిమాలతో సందడి చేస్తుున్నారు. మెగాస్టార్ ఏక కాలంలో నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. ‘భోలా శంకర్, ఆచార్య, గాడ్ ఫాదర్, మెగా154’లో నటిస్తూ బిజీ అయ్యారు. మరోవైపు వవన్ కళ్యాణ్ కూడా ‘భీమ్లా నాయక్, హరి హర వీరమల్లు, భవధీయుడు భగత్ సింగ్’ వంటి చిత్రాల్లో నటిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ కూడా ‘ఆచార్య, ఆర్ఆర్ఆర్, ఆర్సీ 15’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.
కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ మూవీలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఈ మూవీలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కోసం ఇటు మెగా ఫ్యాన్స్.. అటు తెలుగు ఆడియెన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. అలాగే రిలీజ్ కు సిద్ధంగా ఉన్న‘భీమ్లా నాయక్’ మూవీ కూడా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా పూర్తి చేసుకుంది. రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఈ సందరర్భంగా రామ్ చరణ్ ‘భీమ్లా నాయక్’ టీంకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా భీమ్లా నాయక్.. గాడ్ ఫాదర్ మూవీ సెట్స్ లను పవన్, మెగాస్టార్ చిరంజీవి సందర్శించిన వీడియో క్లిప్ లతో కూడిన ఓ వీడియోను సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ‘గాడ్ ఫాదర్ మరియు భీమ్లానాయక్.. ఒకరి సినిమా సెట్లను మరొకరు సందర్శించారు’అంటూ క్యాప్షన్ పెట్టారు. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరిని చూడటంతో మెగా అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. వారి ఆనందానికి అవధులే లేవు. భీమ్లా నాయక్ మూవీ ఫిబ్రవరి 25న రిలీజ్ కానుందంటూ ఫ్యాన్స్, తెలుగు ఆడియెన్స్ కు గుర్తు చేసుకుంటూ వీడియోను పోస్ట్ చేశారు రామ్ చరణ్.
ఈ వీడియో మెగా అభిమానులకు డబుల్ ట్రీట్ ను అందిస్తోంది.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు అన్నదమ్ములు భీమ్లా నాయక్ మరియు గాడ్ ఫాదర్ సినిమా సెట్‌లను సందర్శించి ఒకరినొకరు ఆశ్చర్యపరిచారు. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు స్టార్‌లను కలిసి చూసే అభిమానులకు ఇది మెగా విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. ‘భీమ్లా నాయక్’కు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందించారు. ఇక గాడ్ ఫాదర్ మలయాళ చిత్రం లూసిఫర్ యొక్క తెలుగు రీమేక్.. ఈ చిత్రంలో మెగా స్టార్ కు జోడిగా నయనతార నటిస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్సీ 15’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. త్వరలో ఈ మూవీ నుంచి అప్డేట్ రానున్నట్టు సమాచారం.