రామ్ చరణ్ ను ఆటపట్టించిన ఉపాసన, నెటిజన్ ప్రయోగానికి మెగా ఫ్యాన్స్ ఫిదా..

Published : Feb 12, 2023, 01:46 PM ISTUpdated : Feb 12, 2023, 01:47 PM IST
రామ్ చరణ్ ను ఆటపట్టించిన ఉపాసన, నెటిజన్ ప్రయోగానికి మెగా ఫ్యాన్స్ ఫిదా..

సారాంశం

భర్త రామ్ చరణ్ పై  రివేంజ్ తీర్చుకుంది.. మెగా కోడలు ఉపాసన. భర్త ఒకప్పుడు తనకు చేసిన ఓ చిన్న అవమానానికి పగ తీర్చుకుంది. ఇంకీ చరణ్ కు ఏ పనిష్మెంట్ ఇచ్చిందంటారు..? 


రామ్‌చరణ్‌పై ఆయన సతీమణి ఉపాసన రివెంజ్ తీర్చుకోవడం ఏంటీ.. వింటేనే ఫన్నీగా.. కొంచెం అనుమానంగా ఉంది కదా. పెళ్ళి అయినప్పటి నుంచీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా ఉన్న ఈ జంట.. ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తారు.. సరదాలు, చిన్న చిన్న కోపాలు కామన్ గా ఉండొచ్చు కాని.. రివేంజ్ తీర్చుకునేలా ఏముంటాయి.. అయితే ఇది ఉపాసన రివేంజ్ కాదు. ఒక అభిమాని ఇలా క్రియేట్ చేశాడు. ఇంతకీ ఏం చేశాడంటే..? 

రామ్ చరణ్ పై ఉపాసన సరదాగా రివేంజ్ తీర్చుకుంటే ఎలా ఉంటుంది అనేది ఓ వీడియో ద్వారా చూపించాడు  ఓ నెటిజన్. ప్రస్తుతం  నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఉపాసనకు కూడా నచ్చడంతో ఆమె దీన్ని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ రెండు స్మైలీ ఎమోజీలను జత చేశారు. అయితే ఈ వీడియో రెండు పాత వీడియోలను జత చేసి రీమేక్ చేశాడు నెటిజన్. ఇంతకీ అంతను  ఏం చేశాడంటే..? 

 

సుమారు నాలుగు నెలల క్రితం అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకల సందర్భంగా.. రామ్‌చరణ్, ఉపాసన, సాయిధరమ్ తేజ్‌ల వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఈ వీడియోలో  రామ్‌చరణ్, ఉపాసన, సాయిధరమ్ తేజ్ ఒకే సోఫాలో కూర్చున్నారు. అయితే..సోఫా కాస్త ఇరుగ్గా ఉండటంతో రామ్‌చరణ్ ఉపాసనను పక్క సీటులో కూర్చోమని సరదాగా చెప్పారు. ఆమెను అలా ఆటపట్టించినందుకు రామ్‌చరణ్.. సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి నవ్వుకున్నారు కూడా. భార్యను అలా ఆటపట్టించడంతో చరణ్ కూడా సరదాగా ఫీల్ అయ్యాడు అటు సాయి తేజ్ అయితే గట్టిగా నవ్వేశాడు. ఈ వీడియో అప్పుడు వైరల్ అయ్యింది. నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.  

అయితే ఈ వీడియోను తీసుకుని గతంలో కరోనా వచ్చినప్పుడు రామ్ చరణ్ ఓ ఛాలెంజ్ ను తీసుకుని తన భార్యకు సపర్యలు చేసిన వీడియోను కలిపి నెటిజన్ కొత్త వీడియో తయారు చేశాడు. అబ్బాయిల ఫన్ ఇలా ఉంటుందన్న ఓ నెటిజన్.. దీనికి అమ్మాయిల కౌంటర్ మరో లెవెల్‌లో ఉంటుందంటూ రామ్‌చరణ్, ఉపాసనల మరో వీడియోను జత చేశారు. ఇందులో ఉపాసన రామ్‌చరణ్‌తో ఇంటి పనులన్నీ చేయించి.... తను మాత్రం దర్జాగా కూర్చున్నట్టు చూపించారు. 

 చెట్లకు నీళ్లు పోయడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, స్వయంగా కాఫీ కలిపి ఉపాసనకు ఇవ్వడం తదితర సీన్లన్నీ చూపించి.. అమ్మాయిలతో వ్యవహారం ఇలా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ  వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. అటు ఉపాసన కూడా వీడియోను లైక్ చేయడంతో.. మెగా ఫ్యాన్స్ కూడా తెగ చూసేస్తున్నారు వీడియోను. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?