తనని చరణ్‌ అలా ఆకర్షించాడంటూ అరుదైన ఫోటోని పంచుకున్న ఉపాసన

Published : Mar 25, 2021, 07:54 PM IST
తనని చరణ్‌ అలా ఆకర్షించాడంటూ అరుదైన ఫోటోని పంచుకున్న ఉపాసన

సారాంశం

పెళ్లికి ముందు రామ్‌చరణ్‌, ఉపాసన కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చాలా రోజులు సీక్రెట్‌గా డ్యూయెట్లు పాడుకున్నారట. తాజాగా ఉపాసన పంచుకున్న ఫోటో చూస్తుంటే ఇదే విషయం అర్థమవుతుంది. 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ భార్య ఉపాసన అపోలో ఫార్మకి హెడ్‌గా ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు అరెంజ్‌ మ్యారేజ్‌ చేసుకున్నా, అంతకు ముందు వీరి మధ్య లవ్‌ స్టోరీ ఉంది. ముందు మనసులు కలిసిన తర్వాతే పెళ్లిపీఠలెక్కారీ జంట. 2012 జూన్‌ 14న వీరిద్దరు ఒక్కటయ్యారు. అయితే పెళ్లికి ముందు రామ్‌చరణ్‌, ఉపాసన కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చాలా రోజులు సీక్రెట్‌గా డ్యూయెట్లు పాడుకున్నారట. తాజాగా ఉపాసన పంచుకున్న ఫోటో చూస్తుంటే ఇదే విషయం అర్థమవుతుంది. 

అయితే ఉపాసన.. రామ్‌చరణ్‌ భార్యగానే కాదు, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని, ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. సోషల్‌ మీడియాలో ఉపాసన చాలా యాక్టివ్‌గా ఉంటారు. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులకు అప్‌డేట్‌ ఇస్తుంటారు. తాజాగా రామ్ చరణ్‌తో దిగిన ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. పెళ్లికి ముందు దిగిన ఫోటోలా కనిపిసిస్తోంది. ఇందులో చెర్రీ, ఉపాసన ఇద్దరూ కలిసి ఓ బైక్ దగ్గర నిల్చున్న ఫోటో. 

ఈ సందర్భంగా ఉపాసన చెబుతూ, `హ్యాపీ పీపుల్... తమ జీవితాల్లోని హ్యాపీనెస్ పట్ల ఆకర్షితులవుతుంటారు. నేనూ దీనిని పూర్తిగా నమ్ముతాను. త్రోబ్యాక్‌' అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. రామ్ చరణ్‌ పుట్టిన రోజు మరో రెండు రోజుల్లో ఉన్న నేపథ్యంలో ఉపాసన ఈ పాత ఫోటోను పోస్ట్ చేయడం మరింతగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు ఈ నెల 27.ఈ సందర్భంగా అభిమానులు ఆయనపై ప్రత్యేకంగా రూపొందించిన ట్రిబ్యూట్‌ సాంగ్‌ని విడుదల చేయనున్నారు. శుక్రవారం దర్శకుడు బాబీ ఈ పాటని విడుదల చేయనున్నారు. మరోవైపు రేపు సాయంత్రం నుంచి రామ్‌చరణ్‌ బర్త్ డే వేడుకలు నిర్వహించబోతున్నారు ఫ్యాన్స్.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌