మాధవన్‌కి కరోనా.. `త్రీ ఇడియట్స్` సినిమా కథ చెప్పిన నటుడు

Published : Mar 25, 2021, 07:17 PM IST
మాధవన్‌కి కరోనా.. `త్రీ ఇడియట్స్` సినిమా కథ చెప్పిన నటుడు

సారాంశం

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ ఫెక్ట్, `త్రీ ఇడియట్‌` స్టార్‌ అమీర్‌ఖాన్‌కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో `త్రీ ఇడియట్‌` స్టార్‌ మాధవన్‌కి కూడా కరోనా సోకిందట. గురువారం మాధవన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ ఫెక్ట్, `త్రీ ఇడియట్‌` స్టార్‌ అమీర్‌ఖాన్‌కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో `త్రీ ఇడియట్‌` స్టార్‌ మాధవన్‌కి కూడా కరోనా సోకిందట. గురువారం మాధవన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆయన చాలా ఫన్నీగా ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా పేర్కొనడం విశేషం. `రాంచో(త్రీ ఇడియల్స్`లోని అమీర్‌ పాత్ర పేరు)ను ఫర్హాన్‌(మాధవన్‌ పేరు) ఫాలో అవుతుంటే, వైరస్‌(బొమన్‌ ఇరానీ) మా ఇద్దరి వెంట పడేవాడు. కానీ ఈ సారి వాడికి(కరోనా వైరస్‌)కి మేం చిక్కాం. ఆల్‌ ఈజ్‌ వెల్‌. త్వరలోనే కరోనా వైరస్‌కి కూడా చెక్‌ పడుతుంది` అని అన్నారు. 

ఇంకా చెబుతూ, మాతో పాటు రాజు(శర్మన్‌ జోషి) రాకూడదని భావిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. నా ఆరోగ్యం చాలా బాగుంది` అని చెప్పారు మాధవన్. కరోనా వైరస్‌ తనకి సోకినా కూడా ఇలా సరదాగా మాధవన్‌ స్పందించడం విశేషం. ఇక ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు అమీర్‌ ఖాన్‌ కూడా హోం క్వారంటైన్‌ అయిపోయారు. `రాకెట్రీ` చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల `నిశ్శబ్దం`లో నెగటివ్‌ రోల్‌ చేసిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం
Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌