Upasana: ఉపాసనకి కరోనా పాజిటివ్‌.. షాకిచ్చిన రామ్‌చరణ్‌ వైఫ్‌.. ఏమైందంటే?

Published : May 11, 2022, 02:30 PM IST
Upasana: ఉపాసనకి కరోనా పాజిటివ్‌.. షాకిచ్చిన రామ్‌చరణ్‌ వైఫ్‌.. ఏమైందంటే?

సారాంశం

మెగా అభిమానులకు పెద్ద షాకిచ్చింది ఉపాసన కొణిదెల. తాను కరోనా బారిన పడినట్టు వెల్లడించింది. తాజాగా సోషల్‌ మీడియా ద్వారా ఆమె ఈ విషయాన్ని పంచుకుంది.

కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతుందని అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. రెగ్యూలర్‌ జీవనం సాగుతుంది. ఈ క్రమంలో తాజాగా రామ్‌చరణ్‌ భార్య, ఉపాసన పెద్ద షాకిచ్చింది. తనకు కరోనా సోకినట్టు వెల్లడించింది. గత వారం తాను కోవిడ్‌ బారిన పడినట్టు చెప్పింది ఉపాసన. ప్రస్తుతం కోలుకుందట. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉండాలని తెలిపింది ఉపాసన. 

ఇందులో ఉపాసన చెబుతూ, చెన్నైలోని తన గ్రాండ్‌ పెరెంట్స్‌ను కలిసేందుకు కోవిడ్‌ టెస్ట్‌ చేసుకున్నానని, ఈ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. దీంతో వారం రోజులుగా వైద్యుల సూచనతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నట్లు ఆమె చెప్పారు. `గత వారం కోవిడ్‌ పాజిటివ్‌గా పరీక్షించాను. ముందే వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. దీంతో డాక్టర్స్‌ నన్ను కేవలం పారాసిటమల్‌, విటమిన్‌ టాబ్లెట్స్‌ మాత్రమే వాడమని సూచించారు. ఈ మహమ్మారి సోకండంతో చాలా మంది నాకు నీరసించిపోవడం, హేల్‌ లాస్‌ అవ్వడం, బాడీ పెయిన్స్‌ వంటి సమస్యలు రావోచ్చని చెప్పారు.

కానీ ఇప్పుడు ఆ సమస్యలు ఏం నాలో కనిపంచడం లేదు. ఎందుకంటే నాకు నేను మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాను. అందుకే నాకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. మళ్లీ వైరస్‌ విజృంభిస్తుందా? అంటే చెప్పలేను. కానీ, మనం కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. చెన్నైలోని తాతయ్య-అమ్మమ్మలను కలిసేందుకు కోవిడ్‌ పరీక్షలు చేసుకోవడం వల్ల వైరస్‌ బయటపడింది. లేదంటే అసలు బయటపడేది కాదు` అని పేర్కొంది ఉపాసన. 

విషయం తెలిసిన అభిమానులు ఆందోళన చెందినా, ఆమె కోలుకున్నారనే విషయంతో రిలాక్స్ అవుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో చిరంజీవి, రామ్‌చరణ్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఉపాసన అపోలో ఆసుపత్రులు, ఫార్మసీ నిర్వహకురాలిగా ఉన్నారు. మరోవైపు సామాజిక కార్యకర్తగానూ వ్యవహరిస్తున్నారు. కేవలం వ్యాపారాలే కాదు, సామాజిక కార్యకలాపాల్లోనూ పాల్గొంటూ మల్టీటాలెంటెడ్‌గా రాణిస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం