Box office:మొన్న వారం రిలీజ్ సినిమాల పరిస్దితి ఇదీ!

By Surya PrakashFirst Published May 11, 2022, 1:34 PM IST
Highlights

ఇప్పుడంటే అందరి దృష్టీ సర్కారు వారి పాట మీదే ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు వారం మూడు చిన్న సినిమాలు థియోటర్స్ లో రిలీజయ్యాయి.


మొన్న శుక్రవారం థియేటర్స్ వద్ద సినిమా సందడి బాగానే ఉంది. మే 05న  యాంకర్ సుమ ‘జయమ్మ పంచాయితీ’, విశ్వక్ సేన్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’, శ్రీ విష్ణు ‘భళా తందనాన’ (Bhala Thandanana) చిత్రాలు థియేటర్స్‌లో విడుదల అయ్యాయి. అయితే  విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన అశోకవనంలో అర్జున కళ్యాణం ఒక్కటే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం యూఎస్ లో $100K ను వసూలు చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.6 కోట్ల రూపాయలను వసూలు చేయగలిగింది.

మిగిలిన రెండు చిత్రాలు జయమ్మ పంచాయతీ, భళా తందనాన అసలు అడ్రెస్ లేకుండా పోయాయి. కనీసం ఈ చిత్రాల గురించి పట్టించుకున్న నాథుడు కూడా లేడు. ఇక అర్బన్ ప్రాంతాల్లో అయితే పూర్తిగా ఆంగ్ల చిత్రం డాక్టర్ స్ట్రేంజ్ డామినేషన్ కనిపించింది. దీంతో పాటు కేజిఎఫ్ చాప్టర్ 2 ఇంకా స్ట్రాంగ్ గా థియోటర్స్ దగ్గర కొనసాగుతోంది.

బుల్లితెర స్టార్ యాంకర్‌గా పేరొందిన సుమకి స్టార్ హీరోల నుంచి మంచి సపోర్ట్ ఉండటంతో ‘జయమ్మ పంచాయితీ’ చిత్రానికి పాజిటివ్ బజ్ వచ్చింది. టీజర్, ట్రైలర్‌లలో పెద్దగా ఆకట్టుకునే అంశాలు కనిపించకపోయినప్పటికీ ప్రమోషన్స్‌లో అయితే సుమ పీక్స్ అనిపించింది. అయితే ఇదంతా రిలీజ్ కు  రెండు రోజుల ముందు వరకూ ఉన్న బజ్.. కానీ ఎప్పుడైతే విశ్వక్ సేన్ ఫ్రాంక్ వీడియో వివాదం వైరల్ అయ్యిందో.. ఒక్కసారిగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంపై చర్చ మొదలైంది.

ఆ చర్చ  నెగిటివ్‌ కావచ్చు.. పాజిటివ్ కావచ్చు.. ఏది ఏమైనా.. చాలా ఖర్చు పెట్టినా కూడా రాని ప్రమోషన్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రానికి దక్కింది.  దాంతో ఓ రెండు రోజులు పాటు  ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించే చర్చించుకున్నారు. ఇప్పటివరకూ విశ్వక్ సేన్ సినిమాలను లైట్ తీసుకున్నవాళ్లు కూడా ఈ సినిమాని చూడాల్సిందే అన్నట్టుగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారంటే ఎంత పబ్లిసిటీ ఇచ్చారో అర్ధం చేసుకోవచ్చు.

ఇక శ్రీ విష్ణు ‘భళా తందనాన’ సినిమా అయితే వచ్చామా? వెళ్లామా? అన్న పంథానే కొనసాగింది. మన సినిమాలో కంటెంట్ ఉంటే జనమే ఆదరిస్తారు.. పెద్ద పబ్లిసిటీ అవసరం లేదు అన్నట్టుగానే కంటెంట్‌ను నమ్ముకుని తన పని తాను చేసుకుపోయాడు శ్రీ విష్ణు. అదే ముంచింది సినిమాని. అసలు ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు.

click me!