
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉపాసన వరుసగా పోస్ట్ లు షేర్ చేస్తోంది. త్వరలో కొణిదెల వారి ఇంట వారసుడో వారసురాలో రాబోతున్నారు. ఆ బ్యూటిఫుల్ మూమెంట్ కోసం మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన గర్భిణిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.
ఉపాసన గర్భవతిగా ఉండడంతో ఆమెకి సోషల్ మీడియాలో అనేక శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సన్నిహితుల నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఆమె ముందుగానే గిఫ్ట్స్ కూడా అందుకుంటోంది. ఉపాసన డెలివరీ కాకముందే ఆమె ఊయల గిఫ్ట్ గా పొందింది.
అందంగా, అద్భుతంగా ఉన్న ఊయల గిఫ్ట్ గా రావడంతో ఉపాసన సంతోషంలో మునిగిపోతోంది. ఇంతకీ ఆ ఊయల ఎవరు పంపారో వివరాల్లో తెలుసుకుందాం. ఉపాసన అనేక చారిటి కార్యక్రమాలు నిర్వహించడం చూస్తూనే ఉన్నాం. అనేక స్వచ్చంద సంస్థలకు గతంలో ఆమె సహాయ సహకారాలు, విరాళాలు అందించారు.
అందులో ఒక సంస్థ అయిన ప్రజ్వల ఫౌండేషన్ లోని మహిళలు ఉపాసనకు ఈ ఊయలని గిఫ్ట్ గా పంపారు. ఈ ఊయల కంప్లీట్ గా చేతి కళతో మహిళలు స్వయంగా చేసినది. సెక్స్ ట్రాఫికింగ్ లో చిక్కుకుని బయట పడ్డ మహిళలని ఈ సంస్థ అందుకుంటుంది. ఆ మహిళలు ఉపాసనకు ఈ గిఫ్ట్ పంపారు.
ఈ ఊయల బలం, ఆత్మగౌరవం, ఆశకి ప్రతీకగా తన బిడ్డకు గుర్తుండి పోతుంది అని ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ పెటింది. ప్రేమతో పంపిన గిఫ్ట్ కావడంతో ఉపాసన ఎంతో సంతోషంగా ఊయలని రిసీవ్ చేసుకుంది. ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.