
తెలుగు తెర అందాల చందమామ కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. ఆమె వరుసగా అవకాశాలను దక్కించుకుంటుంది. ఇప్పటికే తెలుగులో బాలకృష్ణతో `భగవంత్ కేసరి` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. బాలయ్యకి జోడీగా చేస్తుంది. మరోవైపు తమిళంలో `ఇండియన్ 2`లో నటిస్తుంది. తాజాగా మరో కొత్త సినిమాకి సైన్ చేసింది. అంతేకాదు ఆమె ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుందని సమాచారం.
`కాజల్60` పేరుతో తాజాగా కొత్త సినిమాని ప్రకటించారు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రీ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో రాత్రి వేళ కాజల్ కారులో డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంది. మిర్రర్‌లో కొద్దిగా ఆమెని చూపించారు. బ్లాక్ స్పెడ్స్ పెట్టుకుని కారు డ్రైవ్ చేస్తుంది. ఒక చేతిని డోర్ బయటపెట్టింది. చేతికి గాజులున్నాయి. ఈ లుక్‌లో చూస్తుంటే కాజల్ బోల్డ్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన టైటిల్, గ్లింప్స్ ని రేపు(జూన్ 18న)న విడుదల చేయబోతున్నారు.
కాజల్ నటిస్తున్న 60వ చిత్రమిది. ఇందులో ఆమె గతంలో ఎప్పుడూ కనిపించని కొత్త లుక్‌లో కనిపించబోతుందని టీమ్ తెలపడం విశేషం. మరి అదేంటనేది ఇప్పుడు సస్పెన్స్, ఆసక్తిని రేకెత్తిస్తుంది. చూడబోతుంటే కాజల్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల వైపు టర్న్ తీసుకుంటుందనిపిస్తుంది. ఇప్పటికే ఆమె `సీత`లో కాస్త ట్రై చేసింది. కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు పూర్తి స్థాయి లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.
జూన్ 19 న ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు రేపు ఒక గ్లింప్స్ వీడియో ను కూడా విడుదల చేయనున్నారు. అఖిల్ డేగల సినిమా కి దర్శకత్వం వహించారు. ఇందులో కాజల్ మునుపెన్నడూ కనిపించని విధంగా ప్రేక్షకులు ఇష్టపడే పాత్రలో కనిపించనుంది. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క ఈ చిత్రాన్ని తమ ప్రొడక్షన్ లో మొదటి సినిమా గా నిర్మిస్తున్నారు. సినిమా సమర్పకుడు శశి కిరణ్ తిక్క ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా అందించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు.
కాజల్ సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. చాలా కాలంగా ప్రేమిస్తున్న ముంబయికి చెందిన వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లుని ఆమె వివాహం చేసుకుంది. మూడేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. గతేడాది కుమారుడు నీల్ కిచ్లుకి జన్మనిచ్చింది. అనంతరం తిరిగి పూర్వ ఫిట్‌నెస్‌ని పొందింది కాజల్. మరింత హాట్‌గానూ తయారైంది. అమ్మగా మారినా ఫిట్ నెస్ తగ్గలేదని నిరూపిస్తూ జిమ్‌లో శ్రమిస్తుంది. ఇప్పుడు సినిమాలతో బిజీ అవుతుంది. అయితే ఇటీవల ఆమె రెండో సారి ప్రెగ్నెంట్ అయినట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అధికారిక సమాచారం లేదు. కానీ ఇప్పుడు కొత్త సినిమా అనౌన్స్ మెంట్ రావడంతో ఆ వార్తల్లో నిజం లేదనిపిస్తుంది. మరి వాస్తవం ఏంటనేది మున్ముందు తేలనుంది.