చరణ్ వైఫ్ ఉపాసన కూతురు క్లిన్ కార విషయంలో ఈర్ష్య పడుతుందట. అందుకు ఉపాసన చెప్పిన కారణం ఆసక్తిరేపుతుంది. నెటిజెన్స్ తమదైన కామెంట్స్ చేస్తున్నారు.
హీరో రామ్ చరణ్-ఉపాసన పెళ్ళైన పదేళ్లకు తల్లిదండ్రులు అయ్యారు. పిల్లల విషయంలో ఒత్తిడి ఎదుర్కొన్న ఈ జంట ఎట్టకేలకు పాపకు జన్మనిచ్చారు. 2023 జూన్ 20న హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ప్రసవించారు. పాపకు క్లిన్ కార అని నామకరణం చేశారు. క్లిన్ కార రాకతో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లి విరిసింది. పలు శుభాలు చోటు చేసుకుంటున్నాయి. క్లిన్ కారను చాలా అపురూపంగా పెంచుకుంటున్నారు..
క్లిన్ కార గదిని ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్స్ తో ప్రత్యేకంగా రూపొందించారు. కేర్ టేకర్ ని నియమించారని సమాచారం. ఆమెకు లక్షల్లో జీతం ఇస్తున్నారట. ఇదిలా ఉంటే క్లిన్ కారకు అమ్మ కంటే నాన్న అంటే ఇష్టం అట. ఈ విషయంలో ఈర్ష్య పడుతున్నట్లు ఉపాసన వెల్లడించింది. తాజా ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ... అమ్మాయిలు నాన్న లిటిల్ ప్రిన్స్ లా ఉంటారు. ఫాదర్స్ ని ఇష్టపడతారు. అబ్బాయిలు అమ్మలను ఇష్టపడతారు.
క్లిన్ కార కూడా నాన్న కుచ్చినే. చరణ్ ని చూస్తే నవ్వుతూ, నొసలు ఎగరేస్తుంది. దాంతో చరణ్ ని చూసి నాకు ఈర్ష్య కలుగుతుంది, అని అన్నారు. నవమాసాలు మోసిన కన్న తల్లి కదా, అందుకే ఉపాసన ఫీల్ అవుతుందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే పిల్లల్ని ఆలస్యంగా ఎందుకు కనాల్సి వచ్చిందో కూడా ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. పిల్లల్ని కనడం పెద్ద బాధ్యత. అన్ని విధాలుగా మేము సిద్ధం అయ్యాక సంతానం పొందాలి అనుకున్నాము. తల్లి కావడం డబుల్ గ్రేట్ ఫీలింగ్ అని ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు.
ఉపాసన అపోలో గ్రూప్ వారసురాలు. రామ్ చరణ్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. చరణ్-ఉపాసనల ప్రేమను పెద్దలు అంగీకరించడంతో 2012లో ఘనంగా వివాహం జరిగింది. ఉపాసన బిజినెస్ ఉమన్ గా రాణిస్తుంది. మరోవైపు చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. వృత్తిపరమైన విషయాల్లో జోక్యం చేసుకోమని ఉపాసన అంటున్నారు.