`గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` మరోసారి వాయిదా?.. కారణం ఇదే?

విశ్వక్‌ సేన్‌ ప్రస్తుతం `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి `అనే మాస్‌ కమర్షియల్‌ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే ఓ సారి వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి పోస్ట్ పోన్‌ అవుతుందట. 


మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి`. ఊర మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతుంది. గోదావరి ప్రాంతంలో సినిమా సాగుతుంది. ఈ మూవీ డిసెంబర్‌ మొదటి వారంలోనే విడుదల కావాల్సింది. కానీ ఒకేసారి మూడు సినిమాలు రావడంతో వాయిదా వేశారు. దీనికితోడు షూటింగ్‌ కంప్లీట్‌ కాకపోవడం, ఔట్‌పుట్‌ సరిగా రాకపోవడంతో వాయిదా వేసినట్టు తెలిసింది. 

ఆ తర్వాత మార్చి 8న విడుదల చేయనున్నట్టు టీమ్‌ ప్రకటించింది. ఈ మేరకు మార్చిలో ప్రామిసింగ్‌ డేట్‌కి రాబోతుందని అంతా భావించారు. ఎలాంటి పోటీ లేకుండా రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో షాకింగ్‌ న్యూస్‌ వినిపిస్తుంది. ఈ సినిమా వాయిదా పడుతుందట. మార్చి 8న రావడం లేదని తెలుస్తుంది. మరోసారి పోస్ట్ పోన్‌ అవుతుందట. 

Latest Videos

పరీక్షల సీజన్‌ నేపథ్యంలో వాయిదా వేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. బెస్ట్ ఔట్‌పుట్‌ కోసం టైమ్‌ తీసుకుంటున్నట్టు మరో వార్త వినిపిస్తుంది. దీంతోపాటు అదే రోజు విశ్వక్ సేన్‌ నటించిన మరో మూవీ `గామి`ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. దీనికి సంబంధించిన ప్రకటన రేపు(బుధవారం) వచ్చే అవకాశం ఉంది. దీంతో `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి`ని వాయిదా వేస్తున్నట్టు సమాచారం. ఈ మూవీ ఏప్రిల్‌కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై మరో ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. 

ఇక `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి`లో విశ్వక్‌ సేన్‌కి జోడీగా నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఇందులో అంజలి మరో కీలక పాత్రలో మెరవబోతున్నారట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి `సుట్టంలా చూసి` అంటూ సాగే పాట విడుదలై మెప్పించింది. 

Read more: `పుష్ప 3` లోడింగ్‌.. `ఆర్‌ఆర్‌ఆర్‌` ఫార్మూలా ఫాలో అవుతున్న సుకుమార్‌.. బన్నీ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోవాల్సిందే
 

click me!