ప్రేమలో పడడం.. రాంచరణ్ కు నమ్మకం లేదు.. ఉపాసన!

Siva Kodati |  
Published : May 30, 2019, 02:39 PM IST
ప్రేమలో పడడం.. రాంచరణ్ కు నమ్మకం లేదు.. ఉపాసన!

సారాంశం

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన సతీమణి ఉపాసనతో విహారయాత్రలో విహరిస్తున్నాడు. రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ గాయాలకు గురికావడంతో షూటింగ్ వాయిదా పడింది. దీనితో రాంచరణ్, ఉపాసన కలసి ఆఫ్రికా వెకేషన్ కు వెళ్లారు. 

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన సతీమణి ఉపాసనతో విహారయాత్రలో విహరిస్తున్నాడు. రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ గాయాలకు గురికావడంతో షూటింగ్ వాయిదా పడింది. దీనితో రాంచరణ్, ఉపాసన కలసి ఆఫ్రికా వెకేషన్ కు వెళ్లారు. ఉపాసన ఓ ఇంటర్వ్యూలో తమ ఆఫ్రికా టూర్ గురించి ప్రస్తావించింది. 

ఉపాసన మాట్లాడుతూ.. నేను, చరణ్ వివాహం చేసుకుని అప్పుడే ఏడేళ్లు గడచిపోయాయి అని తెలిపింది. ప్రతి పెళ్లి రోజుకు తామిద్దరం ఏదోఒక కొత్త విషయం తెలుసుకుంటాం. ఈ సారి వైల్డ్ లైఫ్ జంతువుల గురించి తెలుసుకునేందుకు సౌత్ ఆఫ్రికా వెళ్లినట్లు ఉపాసన తెలిపింది. జూన్ 14న చరణ్, ఉపాసన పెళ్లి రోజు. ఈ సారి మా మ్యారేజ్ డేని కాస్త ముందుగానే జరుపుకుంటున్నాం. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు. త్వరలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీ అయిపోతాడు. సౌత్ ఆఫ్రికాలో చరణ్, ఉపాసన విహరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

వివాహం జరిగాక మేమిద్దరం సాధించాల్సినవి ఇంకా ఉన్నాయి. రాంచరణ్ కు ప్రేమలో పడడంపై నమ్మకం లేదు. కానీ ప్రేమ కారణంగా ఎదగొచ్చని భావిస్తాడు. ఇది కాస్త కొత్తగానే ఉంటుంది అని ఉపాసన తెలిపింది. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ త్వరలోతిరిగి ప్రారంభం కాబోతోంది. కీలకమైన భాగం పూర్తయ్యే వరకు నిర్విరామంగా షూటింగ్ కొనసాగించాలని రాజమౌళి భావిస్తున్నాడు.  

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..