సాహో టీజర్ కి డేట్ ఫిక్స్!

Published : May 30, 2019, 02:15 PM IST
సాహో టీజర్ కి డేట్ ఫిక్స్!

సారాంశం

సాహో రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ రెగ్యులర్ ప్రమోషన్స్ ని వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటోంది. ఇప్పటికే పలు పోస్టర్స్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసిన సాహో ఇప్పుడు అసలైన కిక్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. 

త్వరలో సినిమా యొక్క టీజర్ విడుదల చేసే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే జూన్ 5న ఈద్ సందర్బంగా అదిరిపోయేలా యాక్షన్ టీజర్ ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. అదే రోజు సల్మాన్ ఖాన్ భరత్ రిలీజ్ అవుతుండడంతో హిందీ టీజర్ ను ఆ సినిమా స్క్రీన్ లలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. 

కొన్ని రోజుల క్రితమే టీజర్ ను కట్ చేసి ఉంచారట. దర్శకుడు సుజీత్ మేకింగ్ పవర్ ఏమిటనేది ఈ సినిమా ద్వారా తెలిసే అవకాశం ఉంది. అందుకే టీజర్ పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ  సినిమా వరల్డ్ వైడ్ గా ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. 

PREV
click me!

Recommended Stories

850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం
1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు