Unstoppable : ‘అన్ స్టాపబుల్’ ఫైనల్ సీజన్ ప్రోమో రిలీజ్ .. మహేశ్ బాబుతో షోలో ఆఖరిసారి సందడి చేసిన బాలయ్య

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 21, 2022, 07:56 PM IST
Unstoppable : ‘అన్ స్టాపబుల్’ ఫైనల్  సీజన్ ప్రోమో రిలీజ్ .. మహేశ్ బాబుతో షోలో ఆఖరిసారి సందడి చేసిన బాలయ్య

సారాంశం

 ఇన్నాళ్లు డైలాగ్స్, యాక్షన్ తో  అభిమానులను ఖుషీ చేసిన నందమూరి బాలక్రిష్ణ ఇటీవల ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షోతో  తెలుగు ప్రేక్షకుల్లో జోష్ నింపారు. అయితే తాజాగా ఈ షోకు సంబంధించిన సెషన్ ఫైనల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ‘ఆహా’ రిలీజ్ చేసింది.  

 

నటనతో ఆద్యంతం ఎన్నో సినిమాల్లో మెప్పించిన నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా తనదైన శైలిలో అదరగుడుతున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే'. విభిన్నమైన సినిమాలు, టాక్‌ షోలతో అలరిస్తోన్న తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ఈ షో ప్రసారమవుతున్నది. ఈ షోను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది ఎపిసోడ్ లను షూట్ చేసి, రిలీజ్ కూడా చేశారు.  

అయితే ఇప్పటి వరకు ఈ తొమ్మిది ఎపిసోడ్ లకు మంచి స్పందన లభించింది. తాజాగా పదో ఎపిసోడ్ కు సంబంధించి ‘సెషన్ ఫైనల్ ప్రీమియర్’ అనే టైటిల్ తో కూడిన ఫుల్ లెంత్ వీడియో ఫిబ్రవరి 4న రానున్నట్టు తెలిపారు. దీంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుందనే విషయాన్ని తెలిపింది ఆహా. అయితే ఈ ఎపిసోడ్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబు ( Mahesh Babu) గెస్ట్ గా వచ్చారు.  ఈ మేరకు ఆహా ప్రకటిస్తూ తాజాగా ప్రోమోను కూడా రిలీజ్ చేసింది.  ఈ ప్రోమోలో మహేష్ వెరీ అట్రాక్టివ్ లుక్ తో కనిపించారు. బాలయ్య మాటలకు మురిసిపోయారు. 

 

ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టించింది ఈ షో.  దిగ్విజయంగా ముందుకు సాగుతున్న క్రమంలో పదో ఎపిసోడ్ తో ముగినున్నట్టు ఫైనల్ సెషల్ అని ప్రకటించడంతో పలువురు ప్రేక్షకులు కొంత నిరాశకు గురవుతున్నారు. మరో వైపు మహేశ్ బాబు ఎపిసోడ్ వస్తుందనే ఆనందంలోనూ ఉన్నారు. ఈ షో ప్రారంభం అయినప్పటినుంచి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఈ షోలో ఇప్పటికే అనేక సెలబ్రిటీలు వచ్చి సందడి చేశారు. తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు.  

కాగా, మహేశ్‌ బాబు ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్‌ ఎప్పుడో పూర్తయింది. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫొటోలు అప్పట్లో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన విషయం కూడా తెలిసిందే. బాలకృష్ణతో ఎపిసోడ్‌ మొత్తం సరదాగా గడించిందని మహేశ్‌ బాబు తన ఇన్‌స్టా వేదికగా కూడా తెలిపాడు. ఇప్పటి వరకు వీడియోను దాచిన మేయర్స్ త్వరలో ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేయడంతో ప్రస్తుతం నెట్టింట దూసుకుపోతోంది.  

PREV
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు