
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ తో.. అన్ స్టాపబుల్ సీజన్ 2 కు ఎండ్ పడనుంది. ఈ సీజన్ అనుకున్నదానికంటే రెట్టింపు విజయం సాధించడంతో సీజన్ 3పై దృష్టి సాధించారు మేకర్స్.. ఆహాలో అన్ స్టాపబుల్ 2వ సీజన్ ఎండింగ్ ని అంతకుమించి ప్లాన్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్ట్ లో లాస్ట్ ఎపిసోడ్ తో బ్లాస్టింగ్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ ఎపిసోడ్ పై ఆత్రుతతో ఉన్న ఆడియన్స్.. అటు అన్‌స్టాపబుల్ నెక్స్ట్ సీజన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. సీజన్-3 మరింత అట్టహాసంగా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఆ సీజన్ ఎలా ఉండబోతోంది. ఎలా డిజైన్ చేయబోతున్నారు.. అసలు ఆ థీమ్ ఎలా ఉండబోతుంది అంటూ అందరిలో ఆసక్తి మొదలయ్యింది. ఈ క్రమంలోనే రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. సీజన్-3 మొదటి ఎపిసోడ్ పవర్ ఫుల్ గెస్ట్ లతో స్టార్ చేయాలి అని చూస్తున్నారట. అందుకే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు తెలంగాణ ఐటి మంత్రి కేటిఆర్ కూడా ఈ ఎపిసోడ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రకంగా ప్రయత్నాలు కూడాస్టార్ట్ చేశారట మేకర్స్.
ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అన్ స్టాపబుల్ లో బాలయ్యతో మెగా పవర్ స్టార్ ఇంటర్వ్యూ.. అది కూడా కెటీఆర్ తో కలిసి ఎపిసోడ్ అంటే అది ఏ రేంజ్ లో ఉంటుంది..? ఎలాంటి ప్రశ్నలు బయటకువస్తాయి.. మెగా, నందమూరి వివాదాలు ప్రస్తావనకు వస్తాయా..? పొలిటికల్ గా ఈ ఎపిసోడ్ ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటూ.. రకరకాల చర్చలు ఇప్పటికే ఆడియన్స్ లో మొదలయ్యాయి.
మరో వైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ కు కూడా మొన్నటి ప్రభాస్ ఎపిసోడ్ మాదిరిగానే బ్లాస్టింగ్ రేంటింగ్స్ వచ్చే అవకాశం ఉండటంతో.. ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆహా వారు. యాప్ స్ట్రక్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆమధ్య ప్రభాస్ ఎపిసోడ్ టైమ్ లో ట్రాఫిక్ ఎక్కువ అవ్వడంతో యాప్ క్రష్ అయిపోంది. ఈసారి ఈ ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నారు మేకర్స్.