నేను 90 శాతం కోలుకున్నాను.. తన ఆరోగ్యంపై స్పందించిన విజయ్ ఆంటోనీ!

By Asianet News  |  First Published Feb 2, 2023, 2:13 PM IST

హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ ఆయన హెల్త్ పై తానే స్వయంగా అప్డేట్ అందించారు. దీంతో అభిమానులు ఊపిరిపీల్చుకుంటున్నారు.
 


రోటీన్ కు భిన్నంగా కథలు ఎంచుకోవడంలో కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ స్పెషల్ అని చెప్పాలి. ఇక కొన్నాళ్ల కింద మదర్ సెంటిమెంట్ తో  వచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రం ఎంతంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో తెలిసిందే. ప్రేక్షకుల ఆదరణతో దీనికి సీక్వెల్ ను కూడా ప్రకటించారు. ప్రస్తుతం ‘బిచ్చగాడు 2’ షూటింగ్ కొనసాగుతోంది. రీసెంట్ గా మలేషియాలో చిత్రీకరణ జరపగా..  గత నెల జనవరి 16న విజయ్ ఆంటోనీ తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ ప్రమాదంలో విజయ్ దవడ ఎముకలు, ముక్కు బాగా దెబ్బతింది. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం అందించడంతో విజయ్ తిరిగి మామూలు స్థితికి చేరుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తన ఆరోగ్యంపైనా  ట్వీటర్ వేదిక అప్డేట్ అందిస్తున్నా.. అభిమానులు మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా విజయ్ ఆంటోనీనే స్వయంగా తన ఆరోగ్యంపై అప్డేట్ అందించారు. తమిళంలో ట్వీట్ చేస్తూ హెల్త్ కండీషన్ ను తెలియజేశారు.

Latest Videos

ట్వీట్ చేస్తూ..  ‘నన్ను ప్రేమించే హృదయాలకు కృతజ్ఞతలు. నేను 90 శాతం నయమయ్యాను. నా విరిగిన దవడ, ముక్కు ఎముకలు కలిసిపోయాయి. మీ అభిమానం వల్ల నేను గతంలో కంటే ఇప్పుడు మరింత సంతోషంగా ఉన్నాను. ఏప్రిల్‌లో విడుదల కానున్న పిచైకారన్ 2 పనులను ఈరోజు నుంచి ప్రారంభిస్తాను’ అంటూ అప్డేట్ అందించారు. దీంతో అభిమానులు ఊపిరిపీల్చుకుంటున్నారు. విజయ్ కోలుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


 

அன்பு இதயங்களே
நான் 90% குணம் அடைந்து விட்டேன்.
உடைந்த என் தாடை, மூக்கு எலும்புகள் ஒன்று சேர்ந்துவிட்டன.
என்னமோ தெரியவில்லை, நான் இப்போது முன்பைவிட அதிக சந்தோஷத்தை உங்களால் உணருகிறேன்😊
வரும் ஏப்ரல் வெளியாகும் பிச்சைக்காரன் 2 பட வேலைகளை இன்று முதல் தொடங்குகிறேன்🙏
அன்புக்கு நன்றி

— vijayantony (@vijayantony)
click me!