నటి సోనాలీ ఇంట్లో దూరిన దుండగుడు.. కత్తితో దాడి

Published : May 26, 2021, 12:03 PM ISTUpdated : May 26, 2021, 12:11 PM IST
నటి సోనాలీ ఇంట్లో దూరిన దుండగుడు.. కత్తితో దాడి

సారాంశం

 హిందీ, మరాఠి నటి సోనాలీ కులకర్ణి ఇంట్లో ఓ దుండగుడు హల్‌చల్‌ చేశాడు. నటి తండ్రిపై దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హిందీ, మరాఠి నటి సోనాలీ కులకర్ణి ఇంట్లో ఓ దుండగుడు హల్‌చల్‌ చేశాడు. నటి తండ్రిపై దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పుణెలో పింప్రి చించ్‌వాద్‌లో నివాసముంటున్న నటి సోనాలీ ఇంట్లోకి మంగళవారం నాడు ఓ వ్యక్తి చొరబడ్డాడు. ఒక ఫేక్‌ తుపాకీ‌, కత్తితో టెర్రస్‌ పై నుంచి ఇంట్లోకి ప్రవేశించాడు. అతడిని చూసిన పని మనిషి భయంతో వణికిపోయింది. తన వెనక పోలీసులు ఉన్నారని, అరవొద్దని తాను ఎక్కడ దాక్కోవాలో చెప్పమని ఆదేశించాడా దుండగుడు. 

ఇంతలో నటి తండ్రి మనోహర్‌ ఆ దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు.  అతడు కత్తితో దాడి చేయడంతో మనోహర్‌కు గాయాలయ్యాయి. అనంతరం దొంగ వెంటనే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, అప్పటికే అప్రమత్తమైన కాలనీవాసులు అతని పట్టుకుని దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.ఆ వ్యక్తి సోనాలి అభిమాని అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నటి సోనాలీ కులకర్ణి ఈ నెల మొదటి వారంలో దుబాయ్ లో చార్టర్డ్ అకౌంటెంట్ కునాల్ బెనోడెకర్‌ను వివాహం చేసుకున్నారు.  

హిందీ, మరాఠీ, గుజరాతీ, కన్నడ చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సోనాలి కులకర్ణి. వాటిలో `డాక్టర్‌.బాబా సాహెబ్‌ అంబేద్కర్‌`, `దోగి`, `దియూల్‌`, `గులాబ్‌జామ్‌`, `దిళ్‌ చహతా హై`, `సింగం`, `టాక్సీ నెం.9211, `భరత్‌` చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వీటితోపాటు `ఫీయర్‌ ఫ్యాక్టర్‌ః ఖట్రాన్‌ కే ఖిలాడీ 1`, `జలక్‌ దిఖలాజా 2` షోస్‌లో పాల్గొంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌