సాయిపల్లవి చిత్రం `అనుకోని అతిథి` నిర్మాత గుండెపోటుతో కన్నుమూత

Published : May 26, 2021, 10:52 AM ISTUpdated : May 26, 2021, 01:49 PM IST
సాయిపల్లవి చిత్రం `అనుకోని అతిథి` నిర్మాత గుండెపోటుతో కన్నుమూత

సారాంశం

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌(66) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తనకి గుండెపోటు రావడంతో గమనించి కుటుంబ సభ్యులు స్పందించే లోపే విశాఖలోని తన నివాసం ఆయన ప్రాణాలు వదిలారు. అన్నంరెడ్డి కృష్ణ కుమార్‌ `అనుకోని అతిథి` అనే సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇది మరో రెండు రోజుల్లో `ఆహా` ఓటీటీ విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాలో సాయిపల్లవి, ఫహాద్‌ ఫాజిల్‌ జంటగా నటించారు. మలయాళ చిత్రానికి డబ్బింగ్‌.

దీంతోపాటు తరుణ్ కథానాయకుడిగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో 'సఖియా నాతో రా' చిత్రాన్ని కృష్ణకుమార్ నిర్మించారు. అంతకుముందు 'ఈ పిల్లకి పెళ్ళవుతుందా', 'కలికాలం ఆడది', 'డామిట్ కథ అడ్డం తిరిగింది', 'ఈ దేశంలో ఒకరోజు' చిత్రాలు నిర్మించారు. దర్శకుడు మారుతితో కలిసి 'బెస్ట్ యాక్టర్స్' చిత్రాన్ని నిర్మించారు.‌ మలయాళం సూపర్ హిట్ 'తన్నీర్ మతన్ దినంగల్'ను తెలుగులో రీమేక్ పనుల్లో ఉండగా... ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం దురదృష్టకరం.కృష్ణకుమార్ భార్య జ్యోతి కొన్నేళ్ళ క్రితం కాలం చేశారు.‌ 'వంశ వృక్షం', 'తూర్పు వెళ్ళే రైలు', 'మరో మలుపు', 'మల్లె పందిరి' తదితర చిత్రాలలో ఆమె కథానాయికగా నటించారు. కృష్ణకుమార్, జ్యోతి దంపతులకు ఓ కుమార్తె ఉన్నారు.

నిర్మాత కృష్ణకుమార్‌ మృతిచెందడంతో చిత్రబృందంతోపాటు టాలీవుడ్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. పలువురు సినీ ప్రముఖులు సైతం ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు. కృష్ణకుమార్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇటీవల గుండెపోటుతో ప్రముఖ పీఆర్వో, నిర్మాత బీ.ఏ.రాజు కన్నుమూసిన విషయం తెలిసిందే. అంతకు ముందు టీఎన్‌ఆర్‌, గాయకుడు జి.ఆనంద్‌, స్టిల్‌ ఫోటో గ్రాఫర్‌ మోహన్‌ జీ, రచయిత నంద్యాల రవి వంటి ప్రముఖులు కన్నుమూశారు. ఇలా వరుసగా ప్రముఖుల మరణం టాలీవుడ్‌ లో తీవ్ర విషాదాన్నినింపుతుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌
Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌