‘రాధేశ్యామ్‌’ లో 'టైటానిక్' టైప్ ఎపిసోడ్

By Surya PrakashFirst Published May 26, 2021, 11:11 AM IST
Highlights

సినిమాలో షిప్ ఎపిసోడ్ అరగంట పైగా వస్తుందిట. టైటానిక్ స్దాయిలో ఆ ఎపిసోడ్ ఉండబోతోందిట. పునర్జన్మ థీమ్ కు ఈ షిప్ ఎపిసోడ్ కీలకం అని, షిప్ కు యాక్సిడెంట్ అవుతుందని చెప్తున్నారు. 

పెద్ద సినిమాలని నిలబెట్టేందుకు కొన్ని స్ట్రాంగ్ ఎపిసోడ్స్ అవసరం అవుతాయి. వాటిని నమ్మే సినిమా ట్రీట్మెంట్ రాసుకుని మొదలెడుతూంటారు. వాటినే ముద్దుగా సినిమా యుఎస్ పి అంటూంటారు. అలాంటి యుఎస్ పి లు ‘రాధేశ్యామ్‌’ లో నాలుగైదు ఉన్నాయట. వాటిని లవ్ చేసే డార్లింగ్ షూటింగ్ ఎంత లేటైనా భరిస్తున్నాడు. అందులో ఒక యుఎస్ పి  గురించి బయిటకు వచ్చింది. అదే ఈ సినిమాని నిలబెడుతుందని, చాలా అద్బుతంగా వచ్చిందని చెప్పుకుంటున్నారు. 

ఇంతకీ ఏమిటా హైలెట్ ఎపిసోడ్ అంటే... షిప్ ఎపిసోడ్. సినిమాలో షిప్ ఎపిసోడ్ అరగంట పైగా వస్తుందిట. టైటానిక్ స్దాయిలో ఆ ఎపిసోడ్ ఉండబోతోందిట. పునర్జన్మ థీమ్ కు ఈ షిప్ ఎపిసోడ్ కీలకం అని, షిప్ కు యాక్సిడెంట్ అవుతుందని చెప్తున్నారు. ఈ ఎపిసోడ్ లో హీరో,హీరోయిన్స్ మధ్య వచ్చే లవ్ సీన్స్ ఓ రేంజిలో ఉంటాయని, చాలా కలర్ పుల్ గా డిజైన్ చేసారని, ఇంతకు ముందు తెలుగు తెరపై అలాంటి ఎపిసోడ్ చూసి ఉండరని అంటున్నారు. అయితే ఈ ఎపిసోడ్ కు విఎఫ్ ఎక్స్ మిక్సింగ్ పూర్తిగా అవసరం. అయితే కరోనా ప్రభావంతో వీఎఫ్ఎక్స్ ప‌నులు సరిగ్గా జ‌ర‌గ‌డం లేద‌ని తెలుస్తోంది‌. 

  ప్రభాస్‌, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై ‘జిల్‌’ఫేమ్‌ రాధాకృష్ణ దర్వకత్వంలో ఈ అందమైన ప్రేమకావ్యం రూపుదిద్దుకుంటోంది. భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్‌’పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. సినిమాను అధికభాగం ఇటలీలోనే చిత్రీకరించారు.  ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకర్‌ సంగీతం అందిస్తుండగా, మనోజ్‌ పరమహంస తన కెమెరా పనితనాన్ని చూపెట్టనున్నారు. సచిన్‌ ఖడేకర్‌, ప్రియదర్శి, భాగ్యశ్రీ, మురళీశర్మ, కృనాల్‌ రాయ్‌ కపూర్‌ ఇతర పాత్రల్లో నటిస్తుండగా, కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం! 
 

click me!