
ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ లలో చాలా సినిమాలకు సీక్వెల్స్ సెట్స్ మీద ఉన్నాయి. కొన్ని రిలీజ్ అయ్యాయి. మరికొన్ని ప్రపోజల్ స్టేజ్ లో ఉన్నాయి. మరి అందులో ఒకటైన ఏజంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయకు సీక్వెల్ ఎప్పుడు..?
సినిమాల విషయంలో ఆడియన్స్ టేస్ట్ మారిపోతుంది. వారు సినిమాలు చూసే విధానం కూడా పూర్తిగా మారిపోయింది. పెద్ద సినిమాలే కాదు. కంటెంట్ ఉంటే తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన సినిమాలను కూడా భారీ హిట్లను చేస్తున్నారు. ఈ క్రమంలోనే అలా ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమాల్లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఒకటి.
నవీన్ పొలిశెట్టి హీరోగా స్వరూప్ ఆర్ఎస్‌జే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సైలెంట్ గా వచ్చి.. అనూహ్యంగా సూపర్ హిట్ సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయ్యింది ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లానింగ్ జరుగుతుంది. నిజనికి ఇది ఎప్పుడో చేయాల్సి ఉన్నా కోన్ని కారణాల వల్ డిలై అవుతూ వచ్చింది.
ఇక ఈ మూవీ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్‌జే లేటెస్ట్‌గా తెరకెక్కించిన సినిమా మిషన్ ఇంపాజిబుల్. తాప్సీ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యింది. అయితే ఈమూవీ ప్రమోషన్స్ లో భాగంగా స్వరూప్ తన ఫస్ట్ సినిమా అయినా ఏజెండ్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఈసినిమాకుసీక్వెల్ పక్కాగా ఉంటుందని వెల్లడించాడు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నామని, త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అన్నారు.
క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఏజెంట్ సినిమాలో నవీన్ పొలిశెట్టి డిటెక్టీవ్ పాత్రలో నటించాడు. దాదాపు 5కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్‌లో అందరికి షాక్ ఇస్తూ.. దాదాపు 20కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. నవీన్ పొలిశెట్టిని ఓవర్ నైట్ స్టార్ ను చేసింది.