
తెలంగాణలో పర్యటనకు విచ్చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూరు ఆదివారం హైదరాబాద్‌లో తెలుగు సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి నివాసానికి వెళ్లిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. అక్కడ చిరంజీవితో పాటు నాగార్జున, అల్లు అరవింద్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాల గురించి వారితో కేంద్ర మంత్రి చర్చించారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. తన వద్దకు రావడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా పేర్కొన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ, వేగవంతమైన పురోగతి గురించి.. తన సోదరుడు నాగార్జునతో కలిసి మనం జరిపిన ఆహ్లాదకరమైన చర్చ నచ్చిందని చిరంజీవి అన్నారు.