`మిస్టర్ ప్రెగ్నెంట్` ఉల్టా పల్టా సాంగ్ ఔట్‌.. ప్రెగ్నెంట్‌ అయ్యాక ఏం జరిగిందంటే?

Published : Aug 12, 2023, 05:48 PM ISTUpdated : Aug 12, 2023, 05:49 PM IST
`మిస్టర్ ప్రెగ్నెంట్` ఉల్టా పల్టా సాంగ్ ఔట్‌.. ప్రెగ్నెంట్‌ అయ్యాక ఏం జరిగిందంటే?

సారాంశం

`మిస్టర్‌ ప్రెగ్నెంట్‌` సినిమాలోని `ఉల్టాపల్టా` అంటూ సాగే పాటని శనివారం విడుదల చేశారు.  గర్భం దాల్చిన సోహైల్‌ తను పడే కష్టాలను, అనుభూతుల సమాహారంగా ఈ పాట సాగుతుంది.

క్రేజ్‌తోనే వరుస ఆఫర్లు అందుకున్నాడు. ఆ టైమ్‌లో వచ్చిన సినిమానే `మిస్టర్‌ ప్రెగ్నెంట్‌`. అబ్బాయిలు ప్రెగ్నెంట్ కావడమనే కొత్త, విచిత్రమైన కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రమిది. శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవాయుర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైక్‌ మూవీస్‌ పతాకంపై అప్పిరెడ్డి నిర్మించారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నైజాంలో రిలీజ్‌ చేస్తుండటం విశేషం. 

ఇక తాజాగా ఈ సినిమాలోని `ఉల్టాపల్టా` అంటూ సాగే పాటని శనివారం విడుదల చేశారు. మీడియా ప్రతినిథులతో ఈ పాటని విడుదల చేయించారు. గర్భం దాల్చిన సోహైల్‌ తను పడే కష్టాలను, అనుభూతుల సమాహారంగా ఈ పాట సాగుతుంది. ఆకట్టుకుంటుంది. సరదాగా సాగుతుంది. ఈ పాట రిలీజ్‌ సందర్భంగా హీరో సోహైల్‌ మాట్లాడుతూ, దర్శకుడు శ్రీనివాస్ నాకు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఇన్నోవేటివ్ గా అనిపించింది. కొద్ది సేపటికి ఇంకో కథ ఉంది వింటావా అన్నారు. నేను `మిస్టర్ ప్రెగ్నెంట్` కథే చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఇవాళ ఓటీటీల్లో డిఫరెంట్ కంటెంట్ చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. మా సినిమా కూడా వాళ్లకు అలాంటి అనుభూతి అందిస్తుందని నమ్మాను.

 ఈ సినిమా కోసం 15 రోజులు వర్క్ షాప్స్ చేశాం. రియల్ గా ప్రెగ్నెన్సీ అంత బరువుండే ప్రోత్సటిక్స్ వాడాము. ఈ సినిమా మొదలైన కొత్తలో  కొన్న ట్రోల్స్ వచ్చాయి. కానీ ఇది కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూసేలా ఉంటుంది. ఎక్కడా ప్రెగ్నెన్సీ మీద కామెడీ డైలాగ్స్ పెట్టలేదు. హుందాగా ఒక కథను తెరకెక్కించాం. సినిమా చూశాక మీ సిస్టర్స్, మదర్ ను హగ్ చేసుకుంటారు. ఈ సినిమా ఒప్పుకున్న టైమ్ లో మా సిస్టర్స్ ఇద్దరు ప్రెగ్నెంట్స్ గా ఉన్నారు. వాళ్లను చూస్తూ ప్రెగ్నెంట్ వుమెన్ బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నా. ఇకపై కూడా ఇలాంటి డెఫరెంట్ మూవీస్ చేస్తా` అని అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి మాట్లాడుతూ - ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేసేందుకు నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను స్ఫూర్తిగా తీసుకున్నాను. నా వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అన్ని దగ్గరుండి చూసుకున్నాను. ఏం చేసినా మనం వైఫ్ కు హెల్ప్ చేయగలం కానీ మనం ఆ బాధను తీసుకోలేం. మా పాప పుట్టినప్పుడు ఆమెను నా చేతికి ఇచ్చారు డాక్టర్స్. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. అలాంటి అమ్మతనం అనే బాధ్యతను ఒక అబ్బాయి తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ రాసుకున్నా.

ఇదొక సెన్సిటివ్ సబ్జెక్ట్. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా వెకిలిగా, పిచ్చి కామెడీ చేశారని అంటారు. అందుకే చాలా జాగ్రత్తగా, కత్తి మీద సాములా రూపొందించాం. సోహైల్, రూపా పోటీ పడి ఫర్ ఫార్మ్ చేశారు. సోహైల్ కు ఎంత పేరొస్తుందో, రూపకు కూడా అంతే మంచి పేరు వస్తుంది. ఈ సినిమాలో హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కదిలించే ఎమోషన్ కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎవరైనా, లవర్స్ అయినా కలిసి చూసేలా ఉంటుంది` అని చెప్పారు. 

హీరోయిన్ రూపా కొడవయూర్ మాట్లాడుతూ, `మిస్టర్ ప్రెగ్నెంట్` సినిమాలో ఎంత ఫన్ ఉంటుందో అంత ఎమోషన్ ఉంటుంది. ఇదొక బ్యూటిఫుల్ మూవీ. ఇందులో నటించినందుకు సంతోషంగా ఉంది. మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమా కథ విన్నప్పుడు వీళ్లు సరిగ్గా మూవీని క్యారీ చేయగలరా అనుకున్నాను, కానీ షూటింగ్ చేస్తుంటే దర్శకుడు శ్రీనివాస్ గారికి ఉన్న క్లారిటీ, సోహైల్ డెడికేషన్ ఇవన్నీ చూసి ఇదొక మంచి మూవీ అవుతుందని నమ్మకం ఏర్పడింది. నేనొక డాక్టర్ ని, ఆ ప్రొఫెషన్ కొనసాగిస్తూనే సినిమాలు చేస్తా` అని తెలిపింది.  

నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ , ట్రైలర్ రిలీజైన కొద్ది రోజుల్లోనే అన్ని ఏరియాల బిజినెస్ కంప్లీట్ అయ్యింది. చిన్న సినిమాగా మొదలై..ట్రేడ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంది `మిస్టర్ ప్రెగ్నెంట్`. ఒక స్పెషల్ కాన్సెప్ట్  తో ఈ మూవీని నిర్మించాం. పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ మా సినిమాను చూశారు. ఒక మంచి సినిమా చేశారని అప్రిషియేట్ చేశారు. ఇంట్లో సోదరి, తల్లితో కలిసి ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నా. తెలుగులో ఇలాంటి డిఫరెంట్ మూవీ చేసిన క్రెడిట్ మా సంస్థకు దక్కుతుంది. మా సినిమాను చూసి మైత్రీ లాంటి పెద్ద సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మైత్రీ వారికి థాంక్స్ ` అని అన్నారు. ఇందులో నిర్మాతలు వెంకట్‌ అన్నపరెడ్డి, రవీందర్‌ రెడ్డి సజ్జల పాల్గొన్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?