దుల్కర్ సల్మాన్ కు సాయంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. నిజమెంత..?

Published : Aug 12, 2023, 05:33 PM ISTUpdated : Aug 12, 2023, 05:34 PM IST
దుల్కర్ సల్మాన్ కు సాయంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. నిజమెంత..?

సారాంశం

సౌత్ యంగ్ హీరోకు సాయంగా రాబోతున్నాడట యంగ్ టైగర్ ఎన్టీఆర్.  మలయాళ స్టార్ హీరో.. టాలీవుడ్ లోకూడా  ఎదుగుతున్న దుల్కర్ సల్మాన్ సినిమా ఈవెంట్ కు యంగ్ టైగర్ రాబోతున్నాడా..?   


మలయాళంతో పాటు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ను సంపాదించాడు యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్. తను వేరే భాషల్లో చేసిన సినిమాలు కూడా తెలుగులో డబ్బింగ్ చేస్తూన్నాడు. తెలుగులో డైరెక్ట్ సినిమాలు కూడా చేస్తున్నాడు. టాలీవుడ్ నుంచి అయితే పాన్ ఇండియా స్టార్ గా ఎదగవచ్చు అని అనుకుంటున్నారో ఏమో.. ఇక్కడే ఎక్కువ సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలో దుల్కర్ సల్మాన్ తాజాగా ఓ సినిమాను టాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయబోతున్నాడు. 

యంగ్ హీరో దుల్కర్ సల్మాన్  తాను తాజాగా  నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ ఆఫ్ కోత. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నాడు. అయితే ఈమూవీపై ఇక్కడ పెద్దగా అంచనాలు లేవు. టాక్ కూడా లేదు. అసలు ఏమాత్రం పబ్లిసిటీ అవ్వడంలేదు. దాంతో ఈసినిమాకు ఎలాగైనగా హైప్ తీసుకురావాలి అని  చూస్తున్నాడట దుల్కర్. అందులో భాగంగా  క్రేజీ స్టార్లను తన సినిమాకు సాయంగా వెత్తుకుంటున్నాడు. ఇందులో భాగంగా.. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను తన సినిమా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఆహ్వానించారట. 

ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఈ ఆగస్ట్ 13న జరగనుంది. అయితే దీనికి ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తాడు అని వార్తలు వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరోకు సాయం చేయడం కోసం యంగ్ టైగర్ గ్రీన్ సిగ్నల్  ఇచ్చినట్టు కూడా న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ న్యూస్ మాత్రం ఇంత వరకూ అఫీషియల్ గా అనౌస్స్ చేయలేదు. దాంతో ఓ వర్గం వారు మాత్రం ఇందులో ఎలాంటి నిజం లేదు అంటున్నారు. దీనితో ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అని  కొట్టిపారేస్తున్నారు. 

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ బిజీలో ఉన్నాడు. తారక్  హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా దేవర. ఈసినిమా  షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా మరో పక్క అయితే తారక్ పలు ఎండోర్స్ మెంట్స్ యాడ్స్ లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే జ్యూవ్వల్లరీ యాడ్ తో పాటు.. ఇంకోన్నియాడ్స్ ప్లే అవుతుండగా.. తాజాగా మరో యాడ్ లో ఆయన నటించబోతున్నారు. దానికి సబంధించని న్యూ లుక్ కూడా ఈమధ్య రిలీజ్ అయ్యింది. ఒక్కొక్క యాడ్ ఫిల్మ్ కు 8 కోట్ల వరకూ తీసుకుంటున్నాడట గోబల్ స్టార్. 
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..