
దర్శకుడు మెహర్ రమేష్ ఇప్పుడు హాట్ టాపిక్. జైలర్ సినిమా తో హిట్ కొట్టిన డైరక్టర్ అనేది ఎవరనేది ఎవరికీ అక్కర్లేదు. కానీ చిరంజీవితో డిజాస్టర్ ఇచ్చిన డైరక్టర్ మెహర్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయారు. అయితే మెహర్ రమేష్ ని ఓ విషయంలో మెచ్చుకోవాల్సిందే. అందరూ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే అంటున్నారు. ఇంతకీ అదేమిటి అంటే...
మెహర్ రమేష్ కు సినిమా హిట్, ఫ్లాఫ్ లతో సంభందం లేకుండా పెద్ద హీరోల డేట్స్ పట్టుకుని సినిమాలు తీస్తూ వస్తున్నారు. కెరీర్ ప్రారంభంలోనే ఎన్టీఆర్ తో చేసిన “కంత్రి” పెద్దగా ఆడలేదు. జస్ట్ ఓకే అనిపించుకుంది. ఆ తర్వాత ప్రభాస్ తో చేసిన “బిల్లా” బాగుందనిపించుకుంది. కానీ రీమేక్ ఖాతాలో, ప్రభాస్ ఛరిష్మాలో కొట్టుకుపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన శక్తి మాత్రం షాక్ ఇచ్చింది. మెహర్ ఎక్కువగా ట్రోల్ అయింది మాత్రం ఎన్టీఆర్ హీరోగా “శక్తి” చిత్రంతో. రామ్ చరణ్ “మగధీర”ని మించి భారీ హిట్ కొట్టాలనే ప్రయత్నంతో చేసిన “శక్తి” బెడిసి కొట్టిందని అందరూ అన్నారు. అసలు మెహర్ రమేష్ కు అంత పెద్ద ఆఫర్ ఎలా వచ్చిందో ఎవరికీ అర్దం కాలేదు.
ఇక “శక్తి” వంటి డిజాస్టర్ వచ్చిన తర్వాత మళ్లీ స్టార్ హీరో ని పట్టుకుని అంతకు మించిన ఫ్లాప్ తీసిన ఘనత కూడా మెహర్ కి దక్కుతుంది. వెంకటేష్ తో అదీ సురేష్ బాబు వంటి ఆచి,తూచి ముందుకు వెళ్లే నిర్మాతను ఒప్పించి తీసిన “షాడో” పెద్ద షాక్ ఇచ్చింది. అసలు శక్తి ఆఫర్ ఎలా వచ్చిందో, ఆ తర్వాత షాడో ఎలా పట్టుకున్నాడో ఎవరికీ అర్దం కాలేదు. అక్కడే మెహర్ రమేష్ టాలెంట్ ఉందంటారు. “శక్తి”, “షాడో”ల నుంచి నిర్మాతలు కోలుకునేందుకు చాలా కాలం పట్టింది. ఇక ఈ దర్శకుడికి దాదాపు 9 ఏళ్ళు సినిమాలు తీసే అవకాశం రాకుండా పోయింది.మళ్లీ చిరంజీవితో సినిమా పట్టుకున్నాడు. ఇది మరో పెద్ద షాక్ ఇండస్ట్రీకి.
దాంతో మెహర్ రమేష్ శక్తి యుక్తులు ఇండస్టీకు తెలిసి వచ్చాయి. సినిమాలు డిజాస్టర్స్ తీసినా ఆ ఇంపాక్ట్ తనమీద పడకుండా మరో సినిమా పట్టుకునే మెహర్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందనేది నిజం. ఆ విద్య టాలెంట్ ఉండి సినిమా పట్టుకోలేక వెనకపడే చాలా మంది యంగ్ డైరక్టర్స్ నేర్చుకోవాల్సిందే. ఇక ఇక్కడ మరో విషయం ఏమిటంటే “భోళా శంకర్” నిజానికి ఈ సినిమా హిట్ అవుతుందని ఎవరూ ఆశించలేదు. ఫరవాలేదనుకున్నా ఆకాశానికి ఎత్తేసేవారు. కానీ అదీ జరగలేదు. మెహర్ రమేష్ ఈజ్ బ్యాక్, “మెహర్ రమేష్ మళ్ళీ తన “శక్తి”ని చూపించాడు అంటూ మీమ్స్ కి దొరికిపోయాడు.