విజయ నిర్మలకు యూకే రాయల్ అకాడమీ డాక్టరేట్

First Published May 26, 2017, 8:28 PM IST
Highlights
  • విజయ నిర్మలకు యూకే రాయల్ అకాడమీ అఫ్ గ్లోబల్ పీస్ డాక్టరేట్
  • అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన రికార్డు విజయ నిర్మల సొంతం
  • ఆమె సేవలను గుర్తించి డాక్టరేట్ ప్రదానం చేసిన రాయల్ అకాడమీ

భారతదేశంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా రికార్డ్ సృష్టించిన విజయ నిర్మల మరో ఘనత సాధించారు. నటిగా, దర్శకురాలిగా సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గానూ యూకే లోని రాయల్ అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్ ఆమెకు గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. 1957లో నటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తరువాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. దర్శకురాలిగానూ తన మార్క్ చూపించి ఎన్నో విజయాలను నమోదు చేసింది.

 

విజయ నిర్మల పేరును పద్మ అవార్డుకు ప్రతిపాదిస్తామని ఈ సందర్భంగా మంత్రి తలసాని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విజయనిర్మలకు పద్మ అవార్డు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన సంగతి సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ గుర్తు చేశారు. 

click me!