ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఉగాది గిఫ్ట్ సిద్ధం!

Published : Apr 11, 2021, 06:31 PM IST
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఉగాది గిఫ్ట్ సిద్ధం!

సారాంశం

 ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణలో పాల్గొంటూ బిజీ అయ్యారు. త్రివిక్రమ్ సైతం పవన్ నటిస్తున్న అయ్యప్పనుమ్ కోశియుమ్ మూవీ రీమేక్ చిత్రానికి మాటలు, స్క్రిప్ట్ బాధ్యతలలో తలమునకలయ్యారు. దీనితో మరలా ఎన్టీఆర్ 30 ఆలస్యం అయ్యింది. 

ఉగాది కావడంతో టాలీవుడ్ హీరోలందరూ అప్డేట్స్ తో సిద్ధం అవుతున్నారు. ఇక ఎన్టీఆర్ సైతం తన లేటెస్ట్ మూవీపై క్లారిటీ ఇవ్వనున్నారు. 2019 చివర్లో ఎన్టీఆర్ 30వ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ తో ప్రకటించారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2020 సమ్మర్ లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. అయితే లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఈ ఏడాది ప్రారంభంలో అయినా ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళుతుందని అందరూ అనుకున్నారు. 

 ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణలో పాల్గొంటూ బిజీ అయ్యారు. త్రివిక్రమ్ సైతం పవన్ నటిస్తున్న అయ్యప్పనుమ్ కోశియుమ్ మూవీ రీమేక్ చిత్రానికి మాటలు, స్క్రిప్ట్ బాధ్యతలలో తలమునకలయ్యారు. దీనితో మరలా ఎన్టీఆర్ 30 ఆలస్యం అయ్యింది. అయితే రేపు ఈ చిత్రం అప్డేట్ ఇస్తున్నట్లు సమాచారం అందుతుంది. రేపు సాయంత్రం త్రివిక్రమ్- ఎన్టీఆర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ పై అప్డేట్ ఇస్తారట. 

అలాగే మూవీ టైటిల్ కూడా ప్రకటించే ఆస్కారం లేకపోలేదు. అయిననూ పోయిరావలె హస్తినకు అనే క్లాసిక్ టైటిల్ అనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. మరి ఎన్టీఆర్ 30 టైటిల్ పై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వరకు ఆగాల్సిందే. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఎన్టీఆర్, చరణ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా, చరణ్ రామరాజు రోల్ చేస్తున్నారు. అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది. 

PREV
click me!

Recommended Stories

ఒకే సినిమాలో ముగ్గురు ప్రభాస్ హీరోయిన్లు.. ఒకరిని మించేలా మరొకరు, రెమ్యునరేషన్స్ లో తీవ్ర పోటీ
రజినీ ప్రతి స్టైల్ వెనుక ఇంత కష్టమా? ఆయన పుస్తకంలోని రహస్యాలు!