నాగ్ ...తమ సినిమాపై ఉన్న నమ్మకంతో దాన్ని వదిలేసుకుని ఇప్పుడు అయ్యో అనుకునే పరిస్దితి తెచ్చుకున్నారు.
కొన్ని నిర్ణయాలు కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెడతాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఆచి,తూచి అడుగులు వేయాలి. ఓటీటి లో మంచి ఆఫర్ వస్తే కాదని థియోటర్ రిలీజ్ పట్టుకున్న నాగార్జున ఇప్పుడు అదే రియలైజ్ అవుతున్నారట. ఈ మధ్యనే రిలీజైన నాగ్ తాజా చిత్రం వైల్డ్ డాగ్ ..థియోటర్ లో రిలీజ్ చేస్తే మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ వచ్చింది. మినిమం ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. ప్రక్కనే రిలీజైన సుల్తాన్ ..కు వచ్చిన ఓపినింగ్స్ కూడా రాలేదు. అయితే ఈ సినిమాకు మొదట అదిరిపోయే ఓటీటి ఆఫర్ వచ్చింది. నాగ్ ...తమ సినిమాపై ఉన్న నమ్మకంతో దాన్ని వదిలేసుకుని ఇప్పుడు అయ్యో అనుకునే పరిస్దితి తెచ్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే... ఆ మధ్యన జనవరిలో ఒకవైపు కరోనా పరిస్థితులు చక్కబడుతుండటం, మరోవైపు వ్యాక్సిన్ వస్తుండటంతో నెమ్మదిగా థియేటర్లు తెరుచుకున్నాయి. సంక్రాంతి కానుకగా పలు తెలుగు సినిమాలు వెండితెరపై సందడి చేసాయి. అయినా, కొన్ని చిత్రాలు ఓటీటీకే మొగ్గు చూపాయి. నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలువచ్చాయి. ప్రముఖ ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్ 27 కోట్లు భారీ మొత్తాన్ని ఇచ్చి హక్కులు పొందింది. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా దీన్ని విడుదల చేయనున్నారట.
అయితే ఈ లోగా క్రాక్, జాతిరత్నాలు, ఉప్పెన వరసగా హిట్ అయ్యాయి. దాంతో తమ సినిమా కూడా భాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవుతుందని నాగ్ భావించారు. ఓటీటి డీల్ ని కాన్సిల్ చేసుకుని , థియోటర్ రిలీజ్ కు వెళ్లారు. అయితే ఇప్పుడు సినిమా డిజాస్టర్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ వారు తమ ఒరిజనల్ నెట్ ఫ్లిక్స్ సినిమాగా రిలీజ్ చేసుకోలేరు. దాంతో చాలా తక్కువ రేటుకు ఈ సినిమాని లాక్ చేసి వచ్చే నెలలో రిలీజ్ చేస్తున్నారని సమాచారం. దాంతో నిర్మాతలు చాలా వరకూ నష్టపోయినట్లైంది. నాగార్జున ..తన నిర్ణయానికి నాలుక కరుచుకుని ఇప్పుడు అయ్యో..అలా చేయకుండా ఉండాల్సిందే అనుకున్నా ఫలితం లేకుండా పోయింది.
నాగార్జున ఇందులో ఎన్‌ఐఏ ఏజెంట్‌గా కనిపించారు. ఆయనతో పాటు, సయామీఖేర్, దియా మీర్జా, అతుల్ కుల్‌కర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలు పోషించారు.