తనపై ప్రేమను అలా చాటుకున్న అనుష్క!

Published : Apr 11, 2021, 05:46 PM IST
తనపై ప్రేమను అలా చాటుకున్న అనుష్క!

సారాంశం

కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఏమీ ప్రకటించలేదు అనుష్క. అనుష్కతో చిత్రాలు చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆమె మాత్రం ఎందుకో సుముఖత చూపడం లేదు. దీనితో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. సోషల్ మీడియాలో సైతం పెద్దగా కనిపించరు అనుష్క. 

స్వీటీ అనుష్క శెట్టి సినిమాలు తగ్గించేశారు. బాహబలి సిరీస్ తరువాత ఆమె ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. 2017లో విడుదలైన బాహుబలి 2 తరువాత అనుష్క శెట్టి చేసింది పూర్తి స్థాయి చిత్రాలు రెండు మాత్రమే. భాగమతి చిత్రంతో పాటు నిశ్శబ్దం మూవీలో ఆమె నటించడం జరిగింది. వ్యయప్రయాలకోర్చి ఏళ్ల తరబడి తెరకెక్కించిన నిశ్శబ్దం అనుకున్నంత ఫలితం ఇవ్వలేదు. 

ఇక కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఏమీ ప్రకటించలేదు అనుష్క. అనుష్కతో చిత్రాలు చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆమె మాత్రం ఎందుకో సుముఖత చూపడం లేదు. దీనితో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. సోషల్ మీడియాలో సైతం పెద్దగా కనిపించరు అనుష్క. ఆమెకు సంబంధించిన విషయాలకు మినహా, చాలా విషయాలపై స్పందించారు. 

నేడు అనుష్క ఓ సోషల్ మీడియా పోస్ట్ చేయడం చేయడం జరిగింది. తన పెట్  డాగ్ తో కలిసి ఫోటో దిగిన ఆమె, ఆ ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. నేడు ఇంటర్నేషనల్ పెట్ డే కావడంతో తన పెట్ డాగ్ పై ఇష్టాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఆమె. ఇక 40ప్లస్ లోకి వెళ్లినా, అనుష్క పెళ్లి మాట ఎత్తడం లేదు. అటు ప్రభాస్ కూడా పెళ్లి చేసుకోకపోవడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న పుకారు మాత్రం నడుస్తూనే ఉంది.

PREV
click me!

Recommended Stories

Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి
Nayanam Review:తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి, భర్తను చింపేసిన భార్య వరుణ్ సందేశ్ ‘నయనం’ ఎలా ఉంది?